HomeTelanaganahyderabad18న మంత్రుల రాక...!

18న మంత్రుల రాక…!

  • తాండూర్‌లో రేపటి కార్యక్రమం వాయిదా
  • ఈ నెల 18న నిర్వహణ
  • కార్యకర్తలు గమనించాలని విజ్ఞప్తి 
  • కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగు ప్రకటన

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు లో రేపు జరగబోయే మంత్రుల పర్యటన వాయిదా పడిందని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో, తాండూర్‌లో రేపు జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు . ఈ కార్యక్రమాన్ని తిరిగి ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇప్పటికే పట్టణంలోని మెజారిటీ వార్డుల్లో రేపటి కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు విస్తృతంగా సమాచారం అందించడం జరిగిందన్నారు. అయితే, అనివార్య కారణాల వల్ల తేదీ మారినందున, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, వార్డు ఇన్‌ఛార్జ్‌లు స్పందించి మారిన తేదీ 18వ తేదీ వివరాలను తిరిగి ప్రజలందరికీ చేరవేయాలని విజ్ఞప్తి చేశారు. అందరూ సమన్వయంతో వ్యవహరించి, ఈ నెల 18న జరిగే రూ. 290 కోట్ల తో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని బాతుల నాగు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments