HomeTelanaganahyderabadమంత్రుల పర్యటన వాయిదా..!

మంత్రుల పర్యటన వాయిదా..!

  • అత్యవసర భేటీతో మంత్రులు బిజీ 
  • రూ. 290 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనకు తాత్కాలిక బ్రేక్
  • తిరిగి ఈ నెల 18న పర్యటించే అవకాశం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో రేపు జరగాల్సిన రాష్ట్ర మంత్రుల పర్యటన వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ఈ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 290 కోట్ల భారీ వ్యయంతో చేపట్ట తలపెట్టిన పలు ప అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శ్రీధర్ బాబు లు హాజరుకావాల్సి ఉంది. అయితే, రాజధానిలో సీఎం అత్యవసర భేటీ పిలుపుతో మంత్రుల పర్యటన వాయిదా పడక తప్పలేదు.కాగా, వాయిదా పడిన ఈ శంకుస్థాపన కార్యక్రమాలను తిరిగి ఈ నెల 18వ తేదీన నిర్వహిస్తామని తాండూరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. త్వరలోనే మంత్రుల పర్యటనకు సంబంధించిన తుది షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments