HomeEntertainmentEvil Dead Burn: ఈవిల్ డెడ్ సిరీస్‌లో వ‌చ్చిన కొత్త దెయ్యం ఎలా ఉందంటే..?

Evil Dead Burn: ఈవిల్ డెడ్ సిరీస్‌లో వ‌చ్చిన కొత్త దెయ్యం ఎలా ఉందంటే..?


Evil Dead Burn: ఈవిల్ డెడ్ సిరీస్‌లో వ‌చ్చిన కొత్త దెయ్యం ఎలా ఉందంటే..?

Jul 11, 2026 4:47PM

హాలీవుడ్ సినిమా చరిత్రలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్‌కు సరికొత్త అర్థాన్ని ఇచ్చిన కల్ట్ సిరీస్ ‘ఈవిల్ డెడ్’. 1981వ సంవత్సరంలో ఈ సిరీస్ నుండి మొదటి భాగం విడుదలైనప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు భయంతో వణికిపోయారు. ఆ సమయంలో కొందరు గుండెపోటుతో చనిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయంటే ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం 4 లక్షల డాలర్ల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ మొదటి చిత్రం, ఏకంగా 30 మిలియన్ల డాలర్లను వసూలు చేసి బాక్సాఫీస్ చరిత్రలో ఒక అద్భుతంగా నిలిచిపోయింది. ఆ తర్వాతే ప్రపంచవ్యాప్తంగా దెయ్యాల నేపథ్యంలో వందలాది సినిమాలు రూపుదిద్దుకున్నాయి.

అంతటి ఘనమైన హిస్టరీ ఉన్న ఈ ఫ్రాంచైజీ నుండి ఇప్పటివరకు ఐదు చిత్రాలు వచ్చాయి. ఈవిల్ డెడ్ 2, ఆర్మీ ఆఫ్ డార్క్‌నెస్ తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాల సుదీర్ఘ విరామం తీసుకున్నారు. అనంతరం 2013లో టైటిల్ మార్చకుండా ‘ఈవిల్ డెడ్’ పేరుతోనే రీబూట్ వెర్షన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 2023లో వచ్చిన ‘ఈవిల్ డెడ్ రైజ్’ థియేటర్లలో జనాలను ఎంతగానో వణికించింది. ఇప్పుడు తాజాగా ఈ సిరీస్ నుండి ‘ఈవిల్ డెడ్ బర్న్’ అనే సరికొత్త చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. ఆశ్చర్యకరంగా, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు థియేటర్లలో కూడా ఈ హారర్ త్రిల్లర్ సినిమాకు అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు కావడం విశేషం. తెలుగు ప్రేక్షకులు ఈ కొత్త దెయ్యం ఆటను చూడటానికి భారీగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ సినిమా కంటెంట్ విషయానికి వస్తే, బేసిక్ కథ పాతదే అనిపిస్తుంది. భర్తను కోల్పోయిన ఆలీస్ అనే మహిళ తన ఫ్యామిలీతో కలిసి మనఃశాంతి కోసం ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఇంటికి వెళ్తుంది. అయితే, అక్కడ ఉన్న ‘బుక్ ఆఫ్ డెడ్’ అనే శపించబడిన పుస్తకం ద్వారా ప్రమాదకరమైన ఆత్మలు మేల్కొంటాయి. దీంతో ఆలీస్‌తో పాటు వచ్చిన వాళ్లంతా దెయ్యాలుగా మారి రక్తదాహంతో క్రూరంగా ప్రవర్తిస్తారు. నిన్నటివరకు ప్రాణంగా చూసుకున్న వాళ్లే ఇప్పుడు ప్రాణాలు తీయడానికి వేటాడుతుంటే, ఆ భీకరమైన విష వలయం నుండి అలీషా ఎలా తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది అనేదే ఈ సినిమా అసలు స్టోరీ.

కథ పాతదే అయినా, ‘ఈవిల్ డెడ్ బర్న్’ స్క్రీన్‌ప్లే మరియు కథనం ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. తెరనిండా విపరీతమైన వయొలెన్స్, ఒళ్ళు గగుర్పొడిచే రక్తపాతం ఉన్నప్పటికీ, హారర్ జానర్‌ను అమితంగా ఇష్టపడే మూవీ లవర్స్‌ను ఈ చిత్రం బాగా మెప్పిస్తుంది. సినిమా మధ్యలో కొంత ల్యాగ్ ఉన్న మాట నిజమే అయినప్పటికీ, కొన్ని ముఖ్యమైన హారర్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకుడికి పైసా వసూల్ అనుభూతిని ఇస్తాయి. థ్రిల్, హారర్ ఎలిమెంట్స్‌కు ఎక్కడా లోటు లేకుండా దర్శకుడు సెబాస్టియన్ వానిసెక్ తీసుకున్న జాగ్రత్తలు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తాయి. అయితే సినిమాలో పూర్తిగా సరికొత్త కథనాన్ని ఆశిస్తే మాత్రం ఈ చిత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది. కానీ ఈవిల్ డెడ్ సిరీస్‌కు ఉన్న వీర ఫ్యాన్స్ అయితే మాత్రం థియేటర్లలో ఈ భయానక విజువల్స్ చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

 

 

Evil Dead Burn, Evil Dead Burn Telugu, Hollywood Horror Movies



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments