- ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి రాఖీలు కట్టిన శ్రవణ్, కిరణ్ ల సతీమణులు
- రక్తసంబంధాల అనుబంధానికి ప్రతీకగా పటేల్ శ్రీశైలం కుటుంబ రాఖీ వేడుకలు
జనవాహిని ప్రతినిధి తాండూరు; రక్తసంబంధాల ఆత్మీయతకు, తోబుట్టువుల ప్రేమానురాగాలకు అద్దం పట్టే రాఖీ పౌర్ణమి వేడుకలను పటేల్ శ్రీశైలం కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు ఆర్బిఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి నివాసం లో పండుగ వాతావరణం నెలకొంది.
వేడుకల్లో భాగంగా పటేల్ శ్రీశైలం కుమారులు శ్రవణ్ పటేల్, కిరణ్ పటేల్ ల సతీమణులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కి సశాస్త్రీయంగా రాఖీలు కట్టారు. ఆత్మీయంగా హారతులు పట్టి, మిఠాయిలు తినిపించి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. తమకు ఎల్లవేళలా అండగా నిలిచే సోదరుడికి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ అనుబంధాలు, ప్రేమానురాగాలకు రాఖీ పండుగ ప్రతీక అని తెలిపారు. రాఖీ కట్టిన చెల్లెళ్లకు, పటేల్ శ్రీశైలం కుటుంబ సభ్యులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.
