- త్వరలోనే స్లాబ్ పనులు పూర్తి
- హిందూ బంధువులకు అందుబాటులోకి తీసుకువస్తాం;
ప్రధాన కార్యదర్శి పెట్లోళ్ల నర్సింలు - సహకరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు సమీపంలోని కంజాపూర్ గేట్ వద్ద హిందూ ఉత్సవ సమితికి సంబంధించిన స్థలంలో భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశిత వ్యవధిలోగా పనులన్నీ పూర్తి చేసి, భవనాన్ని అతి త్వరలోనే హిందూ బంధువులందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పెట్లోళ్ల నర్సింలు తెలిపారు.
శనివారం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… భవన నిర్మాణ ప్రక్రియలో భాగం ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. మిగిలిన పనులు కూడా వేగంగా సాగుతున్నాయని, అతి త్వరలోనే స్లాబ్ పనులు కూడా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. తాండూరు పరిసర ప్రాంతాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఉత్సవాల నిర్వహణకు ఈ భవనం వేదికగా నిలవనుందన్నారు.
హిందూ ఉత్సవ సమితి స్థలంలో నిర్మాణ పనులకు, భవన పురోగతికి మొదటినుంచీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తులు, ప్రతినిధులు ప్రజాస్వామ్యబద్ధంగా సహకరించి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు.
