HomeEntertainmentతాప్సీని తొక్కేసిన స్టార్ హీరో? చేదు నిజాలను బయటపెట్టిన హీరోయిన్!

తాప్సీని తొక్కేసిన స్టార్ హీరో? చేదు నిజాలను బయటపెట్టిన హీరోయిన్!

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లింగ వివక్ష, హీరోల పెత్తనంపై స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తాను నటించిన ఓ సినిమాలో తన పవర్‌ఫుల్ ఇంట్రడక్షన్ సీన్ ను ఓ స్టార్ హీరో మార్పించాడని తాప్సీ పన్ను సంచలన విషయాలను బయటపెట్టింది.

తనకు స్టోరీ చెప్పినప్పుడు ఉన్న ఆఫరింగ్ ఇంట్రో సీన్ నచ్చడమే తాను ఆ సినిమాను అంగీకరించడానికి ప్రధాన కారణమని వెల్లడించింది. అయితే అత్యంత భారీ ఖర్చుతో ప్లాన్ చేసిన ఆ ఎంట్రీ సీన్‌ను చూసి.. హీరో తనకు కూడా అందులో ప్రాధాన్యత కావాలని పట్టుబట్టాడట. దాంతో మేకర్స్ ఎవరికీ చెప్పకుండా ఆ సన్నివేశాన్ని మార్చేసి.. హీరోకు సమానమైన ప్రాధాన్యత కల్పిస్తూ షూటింగ్ పూర్తి చేశారు.

ఈ మార్పు చూసి షాక్ అయిన తాప్సీ.. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని డైరెక్టర్‌ను అడగగా.. నీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోలేదని ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడట. తన సినీ ప్రయాణంలో ఇది ఓ చేదు నిజమని.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితికి ఇది అద్ధం పడుతోందని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది.

అంతే కాకుండా మరో సినిమాలో ‘గో టు హెల్’ అనే డైలాగ్ చెప్పడానికి హీరో అభ్యంతరం చెప్పడంతో డబ్బింగ్ చెప్పేందుకు తాను నిరాకరించానని తాప్సీ తెలిపింది. ఆ తర్వాత మేకర్స్ వేరొక డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో ఆ ఒక్క సీన్ మాత్రమే మార్పించారని ఆమె పేర్కొంది. అయితే ఈ సంఘటనలు ఏ సినిమాలోనివి, ఆ హీరో ఎవరు అన్నది మాత్రం తాప్సీ స్పష్టం చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ హీరో ఎవరై ఉంటారా అని విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఇది తాప్సీ బాలీవుడ్‌లో చేసిన చిత్రమా లేక కెరీర్ ఆరంభంలో చేసిన దక్షిణాది చిత్రమా అనే కోణంలో రకరకాల అంచనాలు వేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments