HomeTelanaganahyderabad1న హిందూ ఉత్సవ సమితి సమావేశం...!

1న హిందూ ఉత్సవ సమితి సమావేశం…!

  • తాండూరులో సెప్టెంబర్ 1న హిందూ ఉత్సవ సమితి సమావేశం
  • నూతన కమిటీ ఎన్నిక, ఉత్సవాల కార్యాచరణపై చర్చ
  • భారీ సంఖ్యలో పాల్గొనాలని పెట్లోళ్ల నర్సింలు పిలుపు

జనవాహిని ప్రతినిధి తాండూరు;పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సెప్టెంబర్ 1వ తేదీ (మంగళవారం) ఉదయం 11 గంటలకు హిందూ ఉత్సవ సమితి ముఖ్య సమావేశం నిర్వహించనున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి పెట్లోళ్ల నర్సింలు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సమావేశంలో ప్రధానంగా హిందూ ఉత్సవ సమితి నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే పండుగలు, ఉత్సవాలను నియోజకవర్గ వ్యాప్తంగా వైభవంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాండూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని కుల సంఘాల బాధ్యులు, హిందూ బంధువులు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐక్యమత్యంతో పండుగలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన సలహాలు, సహకారం అందించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments