HomeJobsఅమ్మాయిలకు భారత ఆర్మీ లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే భారీ జీతంతో ఉద్యోగాలు..!

అమ్మాయిలకు భారత ఆర్మీ లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే భారీ జీతంతో ఉద్యోగాలు..!

అమ్మాయిలకు భారత ఆర్మీ లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే భారీ జీతంతో ఉద్యోగాలు..!

దేశ సేవ చేయాలని.. ఆర్మీ యూనిఫాం ధరించాలని కలలు కనే మహిళలకు ఇండియన్ ఆర్మీ సువర్ణావకాశం అందిస్తుంది. 2027 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC Tech) కోర్సు కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత మహిళా ఇంజినీరింగ్ అభ్యర్థులతో పాటు డిఫెన్స్ పర్సనల్ వితంతువుల (Widows of Defence Personnel) నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 33 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

కాగా ఎంపికైన అభ్యర్థులకు ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA)లో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో విధుల్లో చేరే అవకాశం ఉంటుంది. అంతే కకాఉండా ఆకర్షణీయమైన జీతభత్యాలతో పాటు వైద్య సదుపాయాలు, క్యాంటీన్ ప్రయోజనాలు, అధికారిక నివాసం, పింఛన్‌కు సంబంధించిన ప్రయోజనాలు (వర్తించే నిబంధనల ప్రకారం) వీరికి లభించనున్నాయి.

indian-army-notification-for-33-posts-in-68-short-service-commission-and-complete-details

పోస్టుల వివరాలు..

SSC (W) Tech – 68 : 29 పోస్టులు
Widows of Defence Personnel : 2 పోస్టులు
SSC (W) Tech – 68 (Special Entry) : 1 పోస్టు
SSC (W) Non-Tech (Non-UPSC) – 125 : 1 పోస్టు

విద్యార్హతలు..

SSC (Tech) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది ఇంజినీరింగ్ విభాగాల్లో BE/B.Tech పూర్తి చేసి ఉండాలి.

సివిల్ ఇంజినీరింగ్
కంప్యూటర్ సైన్స్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఎలక్ట్రికల్
ఎలక్ట్రానిక్స్ / ECE
మెకానికల్
నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు

ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్‌లో పేర్కొన్న గడువులోపు డిగ్రీ పూర్తి చేసి మార్కుల మెమో సమర్పించాలి.

SSC (W) Non-Tech పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి..

2027 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 2000 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 మధ్య జన్మించిన వారు అర్హులు.

డిఫెన్స్ పర్సనల్ వితంతు అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..

ఈ నియామకాల్లో ప్రత్యేకత ఏమిటంటే రాత పరీక్ష ఉండదు.

దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్
విద్యార్హతలు, గ్రాడ్యుయేషన్ మార్కుల పరిశీలన
SSB (Services Selection Board) ఇంటర్వ్యూ
మెడికల్ పరీక్ష
తుది మెరిట్ లిస్ట్

SSB ఇంటర్వ్యూలో సైకాలజికల్ టెస్టులు, గ్రూప్ టాస్కులు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెడికల్ ఫిట్‌నెస్ తప్పనిసరి.

జీతభత్యాలు..

ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ అందుతుంది.

శిక్షణ పూర్తయ్యాక అధికారిగా నియామకం పొందిన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం లభిస్తుంది. దీనికి అదనంగా వివిధ అలవెన్సులు, మిలిటరీ సర్వీస్ పే, ట్రావెల్, వైద్య సదుపాయాలు తదితర ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

దరఖాస్తు గడువు..

దరఖాస్తుల ప్రారంభం : ఇప్పటికే ప్రారంభమయ్యాయి
చివరి తేదీ : ఆగస్టు 6, 2026

దరఖస్తు విధానం..

అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు విద్యార్హతలు, వయోపరిమితి, అవసరమైన పత్రాలు, ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ అర్హతలు వంటి అన్ని వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments