HomeBusinessరూ.5 లక్షలు తక్కువ.. ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు భలేగా ఉంది.. ఫీచర్లు మాత్రం టాప్ క్లాస్!

రూ.5 లక్షలు తక్కువ.. ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు భలేగా ఉంది.. ఫీచర్లు మాత్రం టాప్ క్లాస్!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి

రూ.5 లక్షలు తక్కువ.. ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు భలేగా ఉంది.. ఫీచర్లు మాత్రం టాప్ క్లాస్!

ఫోక్స్‌వ్యాగన్ ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో తన ప్రీమియం ఎస్‌యూవీ టైరాన్ ఆర్-లైన్‌‌ను విడుదల చేసి మంచి స్పందనను అందుకుంది. ఇప్పుడు అదే మోడల్‌కు మరింత అందుబాటు ధరలో టైరాన్ లైఫ్ (tayron life) అనే కొత్త వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది. కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ లైఫ్ ధర రూ. 41.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, టాప్-ఎండ్ టైరాన్ ఆర్-లైన్ ధర రూ. 46.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అంటే ఈ కొత్త వేరియంట్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 5 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంటుంది. ప్రీమియం లుక్, ఆధునిక టెక్నాలజీ, విలాసవంతమైన క్యాబిన్‌ను తక్కువ ధరలో కోరుకునే వారికి టైరాన్ లైఫ్ మంచి ఎంపికగా నిలవనుంది.

ధరను రూ. 5 లక్షల వరకు తగ్గించిన నేపథ్యంలో, లైఫ్ వేరియంట్‌లో కొన్ని ప్రీమియం ఫీచర్లను తొలగించింది. డిజైన్ పరంగా చూసినప్పుడు ఇది టైరాన్ ఆర్-లైన్‌ను పోలి ఉన్నప్పటికీ, మరింత సింపుల్, క్లాసిక్ లుక్‌తో కనిపిస్తుంది. ముఖ్యంగా ముందుభాగంలో ఉన్న బంపర్, ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌ను కొంత సరళంగా రూపొందించారు. అలాగే ఆర్-లైన్‌లో కనిపించే ప్రత్యేక R-Line బ్యాడ్జింగ్, స్పోర్టీ స్టైలింగ్ ఎలిమెంట్స్ వంటి అంశాలను ఈ వేరియంట్‌లో తొలగించారు.

Volkswagen Tayron Life India Launch Price Specifications Details Inside

దీంతో ఈ ఎస్‌యూవీకి ప్రీమియం లుక్ కొనసాగినప్పటికీ, స్పోర్టీ అప్పీల్ మాత్రం కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. అలాగే అల్లాయ్ వీల్స్ డిజైన్‌లో కూడా మార్పులు చేశారు. కొత్త డిజైన్‌తో కూడిన వీల్స్‌ను అందించడంతో పాటు, ఆర్-లైన్‌లో ఉండే వీల్స్‌తో పోలిస్తే ఇవి కొద్దిగా చిన్న సైజులో ఉన్నాయి. ఇంటీరియర్‌లో ఇదే విధంగా కొన్ని మార్పులు కనిపిస్తాయి. క్యాబిన్‌ను మరింత సింపుల్‌గా తీర్చిదిద్దినప్పటికీ విశాలమైన స్థలం, సౌకర్యవంతమైన సీటింగ్ అంశాలను కొనసాగించింది.

అంటే విలాసవంతమైన అనుభూతిని పూర్తిగా కోల్పోకుండా, కొన్ని ప్రీమియం స్టైలింగ్ ఫీచర్లను మాత్రమే తగ్గించింది. అయితే పనితీరు విషయానికి వస్తే మాత్రం ఫోక్స్‌వ్యాగన్ ఎలాంటి రాజీ పడలేదు. టాప్-ఎండ్ టైరాన్ ఆర్-లైన్‌‌లో ఉపయోగించిన అదే 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌‌ను టైరాన్ లైఫ్‌లో కూడా అందించింది. ఈ ఇంజన్ 204 హెచ్‌పీ పవర్‌తో పాటు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Volkswagen Tayron Life India Launch Price Specifications Details Inside

దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్ జత చేశారు. దీంతో వేగవంతమైన యాక్సిలరేషన్, స్మూత్ గేర్ షిఫ్టింగ్, మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని ఈ ఎస్‌యూవీ అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ధర తక్కువగా ఉన్నప్పటికీ కొత్త టైరాన్ లైఫ్‌లో అనేక ప్రీమియం సౌకర్యాలను ఫోక్స్‌వ్యాగన్ అలాగే కొనసాగించింది. ఇందులో 15-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నయి.

ఇంకా, పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, అలాగే లెవెల్-2 ADAS వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ధర తగ్గినప్పటికీ, టెక్నాలజీ, భద్రత పరంగా వినియోగదారులు ఎలాంటి లోటును పెద్దగా అనుభవించాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ కొత్త వేరియంట్‌లో ఒక కీలక మార్పు ఉంది.

సాధారణ టైరాన్ మోడల్ 7-సీటర్ ఎస్‌యూవీగా ఉండగా, టైరాన్ లైఫ్‌ను మరింత ప్రాక్టికల్‌గా మార్చేందుకు ఇందులో మూడో వరుస సీట్లను తొలగించారు. దీంతో ఇది పెద్ద లగేజ్‌ను తీసుకెళ్లాల్సిన కుటుంబాలకు మరింత ఉపయోగకరంగా మారింది. మూడో వరుస లేకపోవడంతో ఈ ఎస్‌యూవీలో 885 లీటర్ల వరకు భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. కుటుంబంతో లాంగ్ డ్రైవ్‌లు, హాలిడే ట్రిప్‌లు లేదా ఎక్కువ సామాను తీసుకెళ్లాల్సిన సందర్భాల్లో ఇది బెస్ట్.

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments