సొంత కంపెనీ కార్లే షాక్ ఇచ్చినా.. నంబర్-1 సింహాసనం వదలని హ్యుందాయ్ క్రెటా

0
2

సొంత కంపెనీ కార్లే షాక్ ఇచ్చినా.. నంబర్-1 సింహాసనం వదలని హ్యుందాయ్ క్రెటా

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా అమ్మకాల్లో ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. దేశీయ కార్ల విక్రయాల రేసులో ఎప్పుడూ టాప్-10 లో ఉండే క్రెటా.. జూన్ 2026 నెలలో మాత్రం ఊహించని విధంగా వెనుకబడింది. జూన్ నెల సేల్స్ చార్ట్‌లో ఈ కారు తన సొంత కంపెనీకి చెందిన చిన్న కార్లయిన హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ ఎక్స్టర్ మోడల్స్ కంటే కిందకు పడిపోయి, హ్యుందాయ్ కంపెనీలోనే మూడో స్థానానికి పరిమితమైంది.

అంతేకాకుండా దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే టాప్-25 కార్ల జాబితాలో కూడా ఈసారి క్రెటాకు చోటు దక్కలేదు. అయితే, ఈ టెంపరరీ తగ్గుదల వెనుక క్రెటా సరికొత్త మోడల్ త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కాబోతుండటమే ప్రధాన కారణమని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జూన్ నెలలో అమ్మకాలు తగ్గినప్పటికీ, ఓవరాల్ మార్కెట్ లీడర్‌షిప్‌లో క్రెటా హవా ఏమాత్రం తగ్గలేదు.

Hyundai Creta Slips In June Sales But Retains Number 1 Spot In H1 2026 Performance

2026 సంవత్సరం మొదటి అర్ధభాగంలో (జనవరి నుంచి జూన్ వరకు) జరిగిన మొత్తం అమ్మకాలను పరిశీలిస్తే.. క్రెటా తన నంబర్-1 స్థానాన్ని పదిలపరుచుకుంది. ఈ 6 నెలల కాలంలో క్రెటా కారు ఏకంగా 91,509 యూనిట్ల విక్రయాలతో హ్యుందాయ్ కంపెనీలోనే టాప్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

నెలల వారీగా చూస్తే జనవరిలో 17,921 యూనిట్లు, ఫిబ్రవరిలో 17,938 యూనిట్లు, మార్చిలో 17,838 యూనిట్లు, ఏప్రిల్‌లో 15,291 యూనిట్లు, మేలో 15,235 యూనిట్లు అమ్ముడవగా.. జూన్‌లో మాత్రం కేవలం 7,168 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనికి భిన్నంగా హ్యుందాయ్ వెన్యూ 6 నెలల్లో మొత్తం 69,082 యూనిట్లు (జూన్‌లో 10,776), హ్యుందాయ్ ఎక్స్టర్ కారు మొత్తం 39,262 యూనిట్ల (జూన్‌లో 8,154) అమ్మకాలను నమోదు చేశాయి.

Hyundai Creta Slips In June Sales But Retains Number 1 Spot In H1 2026 Performance

ప్రస్తుత స్టాక్‌ను క్లియర్ చేయడానికి, కొత్త మోడల్ రాకను పురస్కరించుకుని హ్యుందాయ్ కంపెనీ ఈ జూలై నెలలో క్రెటా కారుపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలలో క్రెటా కారును కొనుగోలు చేసే కస్టమర్లకు ఏకంగా రూ. 1,00,000 వరకు బంపర్ బెనిఫిట్స్ లభించనున్నాయి. క్రెటా పెట్రోల్ మోడల్స్‌పై గరిష్టంగా రూ. 1 లక్ష వరకు, డీజిల్ మోడల్స్‌పై రూ. 10,000 వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ తన కార్ల శ్రేణిలో ఈ నెల ఇస్తున్న అత్యంత భారీ డిస్కౌంట్ ఇదే కావడం విశేషం. అయితే, కంపెనీ గత నెలలోనే క్రెటా ధరలను 1.08 శాతం (సుమారు రూ. 12,800 వరకు) పెంచింది. ఇందులోని పాపులర్ వేరియంట్ N8 DCTని ఎల్లప్పటికీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Hyundai Creta Slips In June Sales But Retains Number 1 Spot In H1 2026 Performance

భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మొత్తం 7 ప్రధాన వేరియంట్లలో (E, EX, S, S(O), SX, SX Tech, SX (O)) లభిస్తోంది. దీని ప్రారంభ బేస్ వేరియంట్ ‘E’ చూసేందుకు టాప్ మోడల్ లాగే అద్భుతమైన ఫ్రంట్ గ్రిల్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లతో (LED DRLs) వస్తుంది. బేస్ వేరియంట్ లోపల ఫ్యాబ్రిక్ సీట్లు, ఆల్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, మాన్యువల్ ఏసీ, ఫ్రంట్ అండ్ రియర్ యూఎస్‌బీ పోర్టులతో పాటు ఐ20, ఎక్స్టర్ కార్లలో ఉండే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.

అయితే బేస్ మోడల్‌లో ఎలాంటి ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ కానీ, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ కానీ ఉండవు. అదే సమయంలో దీని హై-ఎండ్ టాప్ వేరియంట్లలో డ్రైవర్ భద్రత కోసం అత్యంత అధునాతనమైన లెవెల్-2 ఏడీఏఎస్‎తో పాటు దాదాపు 70 కి పైగా స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లను జోడించారు.

ఇంజన్ ఆప్షన్ల పరంగా క్రెటా బేస్ మోడల్ ‘E’ని కస్టమర్లు రెండు రకాల ఇంజన్ ఛాయిస్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి, ఇవి 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో అనుసంధానించబడి వస్తాయి. భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ధరలు రూ. 10.91 లక్షల నుంచి రూ. 20.11 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ వంటి బలమైన మోడళ్లతో తలపడుతోంది. వీటికి తోడు ఈ పోటీ రేసులోకి కొత్తగా టాటా సియెర్రా కూడా రంగ ప్రవేశం చేయబోతుండటంతో రాబోయే రోజుల్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here