- పైలెట్ రోహిత్ రెడ్డికి రాఖీ కట్టిన కౌన్సిలర్ సుప్రీత కరుణాకర్
- ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండాలి
- ఆత్మీయంగా రాఖీ కట్టిన సుప్రీత కరుణాకర్
జనవాహిని ప్రతినిధి తాండూరు; సోదరభావానికి వేదికగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 34వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పటేల్ సుప్రీత కరుణాకర్ తమ ప్రియతమ నాయకుడు, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అయన నివాసంలో కలసి రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ సుప్రీత రోహిత్ రెడ్డికి మిఠాయిలు తినిపించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజల సేవలో ముందుండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ, అక్కాచెల్లెళ్లకు అన్నగా నిలిచిన తమ నాయకుడికి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కౌన్సిలర్ సుప్రీతకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. వార్డు పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి, పట్టణాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
