HomeJobsJobs: నాలుగేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు-భారీ జీతాలు-ఈ రంగంలో ట్రై చేశారా ?

Jobs: నాలుగేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు-భారీ జీతాలు-ఈ రంగంలో ట్రై చేశారా ?

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి

ప్రస్తుతం భారత్ లో ఎక్కడ చూసినా నిరుద్యోగిత రాజ్యమేలుతోంది. ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఇప్పుడా, అప్పుడా అన్నట్లు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తున్న ఓ కీలక రంగం ఈవీ(EV). దేశంలో పెరుగుతున్న ఈవీ వాహనాల క్రేజ్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే నాలుగు కోట్ల ఉద్యోగాలు కల్పించబోతోందని, అదీ భారీ జీతాల పెంపుతో అని తాజా రిపోర్ట్ వెల్లడించింది.

మన దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల్ని పర్యావరణానికే కాకుండా, భారీ స్థాయిలో ఉపాధి కల్పనకు ప్రధాన కేంద్రంగా అందరూ చూస్తున్నారు. ప్రముఖ మానవ వనరుల సంస్థ అడెక్కో ఇండియా తాజా నివేదిక ప్రకారం, 2030 నాటికి ఈ పరిశ్రమ దేశంలో సుమారు 3 కోట్ల నుంచి 4 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. కేవలం వాహనాల తయారీ మాత్రమే కాకుండా అనుబంధ రంగాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే వీటిలో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే ఫ్యాక్టరీలలో ఉండే ప్రత్యక్ష ఉద్యోగాలు. మిగిలిన 85 నుంచి 90 శాతం వరకు ఉపాధి అవకాశాలు పరోక్ష రూపంలో లభించనున్నాయి. ఛార్జింగ్ కేంద్రాల నిర్వహణ, బ్యాటరీల తయారీ, ప్యాకేజింగ్, రీసైక్లింగ్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, వెహికల్ సర్వీసింగ్ వంటి విభిన్న రంగాలు ఇందులో ఉన్నాయి.

అలాగే సంప్రదాయ ఇంధన వాహన రంగంతో పోలిస్తే, ఈవీ విభాగంలో నైపుణ్యం కలిగిన నిపుణులకు దాదాపు 45 శాతం వరకు అదనపు వేతనాలు లభించే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్, వెహికల్ సాఫ్ట్‌వేర్ వంటి ఆధునిక సాంకేతికతలపై పట్టు ఉన్నవారికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఇందుకు తగిన మానవ వనరుల లభ్యత పరిమితంగానే ఉంది. కాబట్టి ఈవీ విప్లవంలో ప్రారంభంలో వచ్చే ఉద్యోగాలలో సుమారు 40 నుంచి 50 శాతం వరకు తాత్కాలిక లేదా ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన ఉండే అవకాశం ఉందని అడెక్కో ఇండియా తెలిపింది. సంప్రదాయ రంగానికి చెందిన కార్మికులకు వేగంగా రీస్కిల్లింగ్ కల్పించడం, పరిశ్రమలకు అనుగుణంగా విద్యాసంస్థల్లో మార్పులు తీసుకురావడం చాలా కీలకమని ఈ రిపోర్ట్ చెబుతోంది.

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments