HomeEntertainmentలెనిన్ సక్సెస్.. నాగార్జునను హత్తుకొని ఏడ్చేసిన అఖిల్.!

లెనిన్ సక్సెస్.. నాగార్జునను హత్తుకొని ఏడ్చేసిన అఖిల్.!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి


లెనిన్ సక్సెస్.. నాగార్జునను హత్తుకొని ఏడ్చేసిన అఖిల్.!

Jul 11, 2026 9:34AM

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. యువ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచే భారీ విజయం దక్కింది. అఖిల్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘లెనిన్’ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని నటన చూసి సినీ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తన కొడుకు అఖిల్ సరైన కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని ఆరాటపడిన కింగ్ నాగార్జున కల ఎట్టకేలకు ఈ సినిమాతో నెరవేరింది.

ఈ ఘన విజయం అక్కినేని కుటుంబంలో సరికొత్త కాంతులు నింపింది. సినిమాకు వస్తున్న భారీ కలెక్షన్లు, పాజిటివ్ టాక్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌లో పండగ వాతావరణం నెలకొంది. శుక్రవారం సాయంత్రం నాగార్జున స్వయంగా ‘లెనిన్’ చిత్రబృందానికి అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నాగార్జున, అఖిల్, చిత్ర దర్శకుడు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అంతా కలిసి భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ చూసిన నాగార్జున ముఖంలో ఈ విజయానందం మాత్రం చాలా ప్రత్యేకం అనిపించింది.

ఈ సెలబ్రేషన్స్ మధ్య ఒక అత్యంత భావోద్వేగభరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న హిట్ రావడంతో అఖిల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అఖిల్ తన తండ్రి నాగార్జున పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వెంటనే నాగార్జునను గట్టిగా హత్తుకుని ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. కొడుకు పడ్డ కష్టం, అతని కళ్లలోని ఆనంద బాష్పాలు చూసి నాగార్జున కూడా భావోద్వేగానికి లోనయ్యారు. అఖిల్‌ను ఓదారుస్తూ నాగార్జున కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ఎమోషనల్ మూమెంట్‌ని చూసి అక్కడ ఉన్న చిత్రబృందం సైతం ఒకింత కళ్లు చెమర్చారు. తండ్రీకొడుకుల ఎమోషనల్ బాండింగ్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

 

 

Lenin Movie, Akhil Akkineni, Nagarjuna, Emotional, TeluguOne

 



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments