- తాండూరు ప్రజలకు తీరిన రిజిస్ట్రేషన్ల భారం
- పలు చోట్ల సవరించిన ధరలు వెల్లడి
- హర్షం వ్యక్తం చేసిన డాక్యుమెంట్ రైటర్,10వ వార్డ్ కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పురపాలక పరిధిలోని పలు రెవెన్యూ వార్డులు, బ్లాక్‌లలో భూముల మార్కెట్ విలువల భారం తగ్గింది. కొన్ని నెలల క్రితం పెంచిన భూముల ధరల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు, స్థిరాస్తి వ్యాపారులు స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించారు. బాధితుల వినతులపై స్పందించిన ఎమ్మెల్యే, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ధరల తగ్గింపునకు ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు డాక్యుమెంట్ రైటర్,మున్సిపల్ 10వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ… తాజాగా సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను వివరించారు.
వార్డు 1, బ్లాక్ 1: మాలరెడ్డిపల్లి, బాలాజీ నగర్, సీసీఐ కాలనీ ప్రాంతాల్లో పాత ధర ₹8,400 ఉండగా, సవరించిన ధర ₹6,500కి తగ్గిందన్నారు.
వార్డు 2, బ్లాక్ 1: సాయిపూర్ ప్రాంతంలో పాత ధర ₹7,200 కాగా, కొత్త ధర ₹6,000గా నిర్ణయించారన్నారు.
వార్డు 5, బ్లాక్ 1: గొల్లాచెరువు పరిధిలో గతంలో ఉన్న ₹8,700 ధరను ₹6,500కి తగ్గించారు.
వార్డు 8, బ్లాక్ 1: మాణిక్ నగర్‌లో పాత ధర ₹7,200 స్థానంలో సవరించిన ధర ₹6,000 అందుబాటులోకి వచ్చిందని
కాగా, గతంలోనే ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 1-2, 1-3, 1-4, 1-5 బ్లాక్‌లలో భూముల విలువను ₹13,200 నుంచి ₹5,500కి తగ్గించిన విషయాన్ని ఈ సందర్భంగా అల్లాపూర్ శ్రీకాంత్ గుర్తుచేశారు. భూముల మార్కెట్ విలువలను తగ్గించి తమకు ఊరట కలిగించిన ఎమ్మెల్యేకు 10వ వార్డ్ కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్ ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
