Home Entertainment టాలీవుడ్ హీరోల లక్కీ నంబర్ '7'.. 'లెనిన్'తో అఖిల్ అక్కినేని హిట్టు కొడతాడా?

టాలీవుడ్ హీరోల లక్కీ నంబర్ '7'.. 'లెనిన్'తో అఖిల్ అక్కినేని హిట్టు కొడతాడా?

3
0


టాలీవుడ్ హీరోల లక్కీ నంబర్ ‘7’.. ‘లెనిన్’తో అఖిల్ అక్కినేని హిట్టు కొడతాడా?

Jul 9, 2026 5:55PM

Google search engine

 

‘7’.. తర్వాత వచ్చేది ‘8’, ముందు వచ్చేది ‘6’ అని చెప్పుకోవడానికి సినీ పరిభాషలో ‘7’ అనేది  కేవలం నెంబర్ మాత్రమే కాదు. బడా హీరోల సాక్షిగా రికార్డులు సృష్టించాను అని చెప్పడానికి సజీవ సాక్ష్యం. ఈ నెంబర్ కి రేపు లెనిన్ తో రాబోతున్న అఖిల్ ‘లెనిన్’ చిత్రానికి సంబంధం ఉంది. అభిమానులు మాత్రం ‘7 ‘డేట్ ని దృష్టిలో పెట్టుకొని అఖిల్(Akhil)రికార్డులు సృష్టిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. 

టాలీవుడ్ చరిత్రని ఒకసారి పరిశీలిస్తే, దాదాపు 90 శాతం మంది అగ్ర హీరోల కెరీర్‌లో వారి 7వ సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా లేదా మైల్ స్టోన్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఉదాహరణకు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 7వ చిత్రంగా వచ్చిన ‘ఒక్కడు’ టాలీవుడ్ రికార్డులని  తిరగరాసి  టాప్ లీగ్‌లో నిలబెట్టింది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 7వ చిత్రం ‘ఖుషి’ అప్పట్లో సృష్టించిన ట్రెండ్ సెట్టింగ్ సక్సెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ కెరీర్ రేంజ్‌  మార్చేసిన ‘సింహాద్రి’  కూడా 7వ చిత్రమే కావడం గమనార్హం.

ఈ అద్భుతమైన సెంటిమెంట్ కేవలం వీరితోనే ఆగిపోలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిన ‘ఆర్య 2’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌ని  పెంచిన ‘ఎవడు’, న్యాచురల్ స్టార్ నాని కామెడీ టైమింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘పిల్ల జమిందార్’, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘కందిరీగ’ ,విజయ్ దేవరకొండ కెరీర్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరిన ‘గీత గోవిందం’.. ఇవన్నీ ఆయా హీరోల కెరీర్‌లలో 7వ సినిమాలే  . రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక్కరి విషయంలో మాత్రమే ఈ సెంటిమెంట్ మినహాయింపుగా నిలిచింది. మిగిలిన అందరు స్టార్స్ ఈ 7వ నంబర్ మ్యాజిక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని  సాధించి సత్తా చాటారు. అక్కినేని వంశంలో కూడా ఈ సెంటిమెంట్‌కు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అక్కినేని నాగార్జున నటించిన 7వ సినిమా ‘అగ్నిపుత్రుడు’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ హిట్టయిన ‘మనం’ సినిమా కూడా ఆయనకు 7వ చిత్రం కావడం విశేషం. ఇప్పుడు అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాతో సరిగ్గా అదే స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు అఖిల్ నటించిన ‘అఖిల్’, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘ఏజెంట్’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్‌గా నిలిచినా, అది అఖిల్ కెరీర్‌కి ఆశించినంత బూస్ట్ ఇవ్వలేకపోయింది.

jana nayagan: జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్!.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కెనడా డిస్ట్రిబ్యూటర్ 

మరి టాలీవుడ్ లక్కీ నంబర్ ‘7’ సెంటిమెంట్ నిజమై, అయ్యగారు  ‘లెనిన్’తో టాలీవుడ్‌లో తన మొదటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని  అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మాములుగా చూస్తే అఖిల్ హీరోగా లెనిన్  6వ సినిమా. కానీ చిన్నతనంలో లీడ్ రోల్‌లో నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘సిసింద్రీ’ మూవీని కూడా లెక్కిస్తే,  లెనిన్ 7 నే. లెక్క లెక్కేగా.

 



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here