Home News దేశసేవకు అంకితం కావాలి..!

దేశసేవకు అంకితం కావాలి..!

86
0
  • ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ వేడుకలు
  • దేశసేవకు విద్యార్థులు పునరంకితం కావాలి
  • ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు అజయ్ కుమార్

జనవాహిని ప్రతినిధి తాండూరు : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నగర శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్ కుమార్ మాట్లాడారు. 1949 జూలై 9న జ్ఞానం, శీలం, ఐక్యత” అనే నినాదంతో ప్రారంభమైన ఏబీవీపీ.. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి శక్తిగా ఎదిగిందని గుర్తుచేశారు.కేవలం విద్యా రంగ సమస్యలపైనే కాకుండా సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల సహాయక చర్యల్లో పరిషత్ కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. వివేకానందుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం యువతలో దేశభక్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోందన్నారు. విద్యార్థులంతా దేశ సేవకు, సామాజిక వికాసానికి అంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో ఏబీవీపీ నగర నాయకులు నవీన్ గౌడ్, పవన్ కుమార్, రాజేష్, ప్రకాష్, లాలూ ప్రసాద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here