HomeEntertainmentనాని లైనప్‌లో క్రేజీ కాంబో.. సుజీత్ ట్విస్ట్‌తో మారబోతున్న నేచురల్ స్టార్ ప్లాన్స్!

నాని లైనప్‌లో క్రేజీ కాంబో.. సుజీత్ ట్విస్ట్‌తో మారబోతున్న నేచురల్ స్టార్ ప్లాన్స్!

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


నాని లైనప్‌లో క్రేజీ కాంబో.. సుజీత్ ట్విస్ట్‌తో మారబోతున్న నేచురల్ స్టార్ ప్లాన్స్!

Jul 6, 2026 1:19PM

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత నాని లైనప్‌లో అనేక క్రేజీ కాంబినేషన్లు లైన్లో ఉన్నాయి. తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో నాని ఒక సరికొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు.

అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయంలో ఒక ఆసక్తికరమైన సమీకరణం తెరపైకి వచ్చింది. నాని లైనప్‌లో దర్శకుడు సుజీత్‌తో ‘బ్లడీ రోమియో’ అనే హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే అనౌన్స్ అయింది. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో దాదాపు 80 శాతం షూటింగ్ జరుపుకోవడానికి ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ కోసం సుజీత్ ఇప్పటికే లండన్‌లో లొకేషన్ స్కౌటింగ్ కూడా పూర్తి చేశారు. కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. ఒకవేళ సుజీత్ ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా ‘బ్లడీ రోమియో’ సినిమాను మొదలుపెడితే, నాని-వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రాబోయే చిత్రం కొంచెం ఆలస్యంగా ప్రారంభం అవుతుంది.

కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సుజీత్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘OG 2’ కథా చర్చలు కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. ఒకవేళ సుజీత్ ‘బ్లడీ రోమియో’ కంటే ముందే పవన్ కళ్యాణ్ ‘OG 2’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని నిర్ణయించుకుంటే మాత్రం నాని లైనప్ పూర్తిగా మారిపోతుంది. సుజీత్ ‘OG 2’ బిజీలోకి వెళ్తే, నాని తన ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టి, అంతకంటే ముందే వెంకీ అట్లూరి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ఈ రెండు ఆప్షన్లలో ఏది ముందు జరిగినా, నేచురల్ స్టార్ నాని ఖాతాలో మాత్రం ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా బ్లాక్‌బస్టర్ లైనప్ సిద్ధంగా ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అటు సుజీత్ మార్క్ ఇంటర్నేషనల్ స్టైలిష్ యాక్షన్ డ్రామా ‘బ్లడీ రోమియో’, ఇటు వెంకీ అట్లూరి మార్క్ క్లాసిక్ ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ డ్రామా.. ఈ రెండూ నాని నటనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించేందుకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. 

ప్రస్తుతం ‘ది పారడైజ్’ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాని వర్క్ చేస్తున్నారు. ఆ సినిమా ముగిసిన వెంటనే సుజీత్ లేదా వెంకీ అట్లూరి ప్రాజెక్టులలో ఏది ముందు ప్రారంభం కానుందనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా నాని ప్లానింగ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద నేచురల్ స్టార్ విధ్వంసం మామూలుగా ఉండదని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Nani, The Paradise, Sujeeth, Bloody Romeo, Venky Atluri, TeluguOne

 



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments