HomeEntertainmentఇదే నిజమైతే ఇక మాట్లాడుకోవడాలు లేవ్

ఇదే నిజమైతే ఇక మాట్లాడుకోవడాలు లేవ్

జనవాహిని TV EPAPER CLIP STUDIO • READY


ఇదే నిజమైతే ఇక మాట్లాడుకోవడాలు లేవ్

Aug 20, 2026 1:00PM

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ రాకా. పుష్ప 2 , జవాన్ తర్వాత ఆ ఇద్దరు కలుస్తుండటంతో ‘రాకా’ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాక్కర్లేదు. సన్ పిక్చర్స్ సుమారు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ భారీ వండర్ ప్రాజెక్ట్ గురించి తాజాగా బయటకు వచ్చిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్‌లో  కీలకమైన విలన్ రోల్ లో లేదాప్రైమరీ అంటాగనిస్ట్ గా కనిపించనున్నారనే వార్తలు  వినబడుతున్నాయి. విల్ స్మిత్ డేట్స్ ఖరారైన వెంటనే షూటింగ్ పార్ట్‌ని  విదేశీ షెడ్యూల్‌లో ప్లాన్ చేయడానికి టీమ్ సమాయత్తమవుతుందని,అల్లు అర్జున్, విల్ స్మిత్ నేరుగా ఢీకొట్టే సన్నివేశాలు ఇండియన్ స్క్రీన్‌పై ఊహించని స్థాయిలో సరికొత్త విజువల్ వండర్‌ని  ఆవిష్కరించనున్నాయని కూడా అంటున్నారు.  మరి విల్ స్మిత్ రాకాలో భాగస్వామ్యం కావడం  నిజమైతే భారతీయ సినిమా పక్కాగా ప్రపంచ సినీ ప్రేక్షకుల ఒడిలో చేరినట్టే. రాకా సబ్జెక్టు ప్రకారం ఒక భారీ విదేశీ స్టార్ విలన్ గా అవసరం అనేది మాత్రం నిజం. 

 

Also Read: ఓవర్సీస్ లో విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్స్ సునామీ

దీపికా పదుకొణే ఒక హీరోయిన్ గా చేస్తుండగా  రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల పేర్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్  ఒక ప్రత్యేకమైన కేమియో రోల్ అనే టాక్ కూడా నడుస్తూ ఉంది. ఏది ఏమైనా రూమర్స్ అన్ని నిజం అయ్యి భారతీయ సినీ ప్రేమికులు, ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేమికుల కలలు నెరవేరాలని కోరుకుందాం.  

Will Smith, Allu Arjun, Raaka, Deepika Padukone, Atlee



Source link

జనవాహిని TV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments