HomeJobsCSIR తీపికబురు.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు !!

CSIR తీపికబురు.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు !!

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY

CSIR తీపికబురు.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు !!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CSIR) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 37 జాతీయ పరిశోధనా సంస్థల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (Assistant Section Officer – ASO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఈ నియామకాలకు ప్రత్యేక అర్హతను నిర్ణయించింది.

ఈ రిక్రూట్‌మెంట్‌లో సాధారణ డిగ్రీ అర్హతతో పాటు UPSC Civil Services Examination-2024లో పాల్గొని ఫైనల్ సెలక్షన్ పొందని, UPSC “Pratibha Setu” పోర్టల్‌లో జాబితాలో ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు వేతనం, అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ తదితర ప్రయోజనాలు లభిస్తాయి.

council-of-scientific-and-industrial-research-notification-for-100-assistant-section-officer-posts

మొత్తం ఖాళీలు..

100

పోస్టులు..

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్): 61 పోస్టులు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్): 18 పోస్టులు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (స్టోర్స్ & పర్చేజ్): 21 పోస్టులు

విద్యార్హత..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే, ఇది సాధారణ రిక్రూట్‌మెంట్ కాదు. UPSC Civil Services Examination-2024లో పాల్గొని తుది ఎంపిక కాకుండా, UPSC ప్రతిభా సేతు (Pratibha Setu) పోర్టల్‌లో నమోదైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

వయోపరిమితి..

దరఖాస్తుదారుల గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం..

ఈ నియామకాల్లో ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులను ఈ విధంగా ఎంపిక చేస్తారు.

UPSC Civil Services Examination-2024 మెయిన్స్ మరియు పర్సనాలిటీ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్

అనంతరం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) నిర్వహిస్తారు.

అయితే CPT కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇందులో కనీస అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది.

జీతభత్యాలు..

ఎంపికైన అభ్యర్థులు Pay Level-7 కింద నియమితులవుతారు.

ప్రారంభ ప్రాథమిక వేతనం: రూ.44,900
గరిష్ట ప్రాథమిక వేతనం: రూ.1,42,400
అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ సౌకర్యాలు, పెన్షన్ ప్రయోజనాలు తదితర కేంద్ర ప్రభుత్వ బెనిఫిట్స్ లభిస్తాయి.

దరఖాస్తు ఫీజు..

జనరల్ / OBC / EWS అభ్యర్థులు: రూ.500
మహిళలు, SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

దరఖాస్తు గడువు..

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఇప్పటికే ప్రారంభం
దరఖాస్తుల చివరి తేదీ: జులై 13, 2026

చివరి తేదీ వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఎలాంటి అప్లికేషన్లు అంగీకరించబడవు.

దరఖాస్తు విధానం..

అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు, అవసరమైన పత్రాలు, రిజర్వేషన్ నిబంధనలు, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ వివరాలు పరిశీలించడం మంచిది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్: https://www.csir.res.in/ సందర్శించవచ్చు.

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments