HomeEntertainmentఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో చేసిన అద్భుత సృష్టి ‘సింగ్ గీతం’.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ఫాంటసీ కామెడీ మ్యూజికల్ ఫిల్మ్ పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. మాటలు లేకుండా కేవలం పాటలతోనే థియేటర్లలో ప్రేక్షకులను వినూత్నంగా ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ లవర్స్ ను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోంది. సింగ్ గీతం మూవీ జూలై 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ మూవీలో అయాన్, అహల్య, షాలిని, తులసి కీలక పాత్రల్లో నటించారు. ఇక సింగ్ గీతం మూవీ కథ విషయానికి వస్తే.. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతాప్ అనే యువకుడు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు కుబేరపురం అనే గ్రామంలో ఉన్నాయని తెలిసి అక్కడకు వెళ్తాడు. అయితే ఇవి మామూలు భూములు కావని.. ఇందులో బంగారం గనులు ఉన్నాయని తెలుస్తుంది.

singageetham OTT Release Super Hit Film to Stream on Netflix from July 9 Singa Geetham Netflix

మరోవైపు ఆ ఊరిలో ఉన్న ఒకే ఒక చెట్టును కంటికి రెప్పలా చూసుకుంటుంది గౌరి అనే అమ్మాయి. అయితే బంగారం తవ్వకం కోసం ఈ చెట్టును కూడా కొట్టేస్తారు. దాంతో ఆ ఊరి ప్రజలకు శాపం తగులుతుంది. గ్రామంలోని ప్రజలు మాట్లాడే ప్రతి భావోద్వేగం, ప్రతి స్పందన పాట రూపంలో వ్యక్తం అవుతుంది. సంతోషం, బాధ, కోపం, ప్రేమ, ఆశ్చర్యం.. ఇలా ప్రతి భావాన్ని సంగీతం ద్వారానే వ్యక్తపరిచేలా శాపం తగులుతుంది. అయితే మరి ఆ ఊరి ప్రజలు శాపం నుంచి ఎలా విముక్తి పొందారు..? తర్వాత జరిగిన స్టోరీ ఏంటి..? అనేదే సినిమా స్టోరీ..



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments