జై హనుమాన్ మాస్ అప్‌డేట్..! రిషబ్- రానా 20 రోజులు వార్..!
భారతీయ సినిమా గర్వించదగ్గ సూపర్ హీరో చిత్రాల్లో హనుమాన్ ఒకటి. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని కేవలం రూ. 30 నుంచి రూ. 40 కోట్లతోనే నిర్మించగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 350 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించాడు. ఈ మూవీ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ భారీ వసూళ్లు సాధించింది.
అయితే ఈ మూవీ చివరలో హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ రానున్నట్లు పేర్కొంది. ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ రానా దగ్గుపాటి ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రిషబ్ శెట్టి- దగ్గుపాటి రానా మధ్య 20 రోజుల పాటు కీలక సన్నివేశాలను షూట్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, టీ- సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ మూవీకి హరిగౌరి సంగీతం అందిస్తున్నారు. హనుమాన్ చిత్రానికి కూడా ఈయనే సంగీతం అందించారు. జై హనుమాన్ మూవీ స్టోరీ మరింత శక్తివంతంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్రేతాయుగంలో శ్రీరాముడికి హనుమంతుడు ఒక పవిత్రమైన మాట ఇస్తారని.. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి స్వామి చేసే యాత్రే ఈ మూవీ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో భక్తి ఎలిమెంట్స్ కు తోడుగా అద్దిరిపోయే యాక్షన్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా ఉండబోతున్నాయట. ఇక ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా నిలువనుంది.





