HomeJobsఇంకా 9-5 ఉద్యోగమా ? టాప్ కంపెనీలకు గుడ్ బై- జీవితపాఠం నేర్చుకున్న IIT గ్రాడ్యుయేట్..!

ఇంకా 9-5 ఉద్యోగమా ? టాప్ కంపెనీలకు గుడ్ బై- జీవితపాఠం నేర్చుకున్న IIT గ్రాడ్యుయేట్..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY

ఇంకా 9-5 ఉద్యోగమా ? టాప్ కంపెనీలకు గుడ్ బై- జీవితపాఠం నేర్చుకున్న IIT గ్రాడ్యుయేట్..!

ఐఐటీ(IIT), హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్ధల్లో చదువుకుని మైక్రోసాఫ్ట్, రేజర్ పే, అన్ అకాడమీ వంటి టాప్ కార్పోరేట్ కంపెనీల్లో దాదాపు దశాబ్దం పాటు ఉద్యోగం చేసిన ఓ యువతి.. ఇక చాలనుకుని చేస్తున్న పనికి గుడ్ బై చెప్పేసింది. దీనికి కారణం ఏంటో తెలుసా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉద్యోగం చేయాల్సి రావడమే. ఈ హడావిడి ఉద్యోగ జీవితాన్ని వదిలేసిన తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పుల్ని ఆమె ఎక్స్ లో పంచుకోవడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

కాక్రోచ్ జనతా పార్టీని నడపబోతున్న ఆ 12 మంది ఎవరు ? రాజకీయం అంటని జెన్ జీ ప్రతినిధులు..!
కాక్రోచ్ జనతా పార్టీని నడపబోతున్న ఆ 12 మంది ఎవరు ? రాజకీయం అంటని జెన్ జీ ప్రతినిధులు..!

టాప్ కార్పోరేట్ కంపెనీల్లో జనరల్ షిప్ట్ గా భావించే 9-5 ఉద్యోగాల్ని వదిలేసిన తర్వాత ఛార్మీ కపూర్ (Charmie Kapoor) తన జీవితం ఎలా ఉందో ఎక్స్ లో షేర్ చేశారు. ఇందులో ఆమె.. ప్రతి నెలా ఒకటో తేదీకి వచ్చే జీతం ఇచ్చే ఆర్థిక భద్రతను కోల్పోవడం ముందు కొంత ఆందోళన కలిగించినా.. రోజువారీ పనులకు ఎలాంటి క్యాలెండర్ షెడ్యూల్స్ లేకపోవడం ఎంతో స్వేచ్ఛను ఇచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే లేచిన తర్వాత ఆ రోజును ఎలా గడపాలో స్వయంగా నిర్ణయించుకోవడం సరికొత్త అనుభూతిని ఇస్తోందన్నారు. ఈ ప్రయాణంలో తన పాత జీవితాన్ని మరింత నిశితంగా పరిశీలించే అవకాశం కూడా దొరికిందని చార్మీ చెబుతున్నారు.

Harvard-IIT Graduate Leaves 9-to-5 After a Decade Opens Up About Life Without a Fixed Work Schedule

32 లక్షల జీతం వద్దనుకున్న ఐఐటీ గ్రాడ్యుయేట్.. ! రీజన్ తెలిస్తే షాక్..!
32 లక్షల జీతం వద్దనుకున్న ఐఐటీ గ్రాడ్యుయేట్.. ! రీజన్ తెలిస్తే షాక్..!

తన జీవితంలో పదేళ్ల పాటు ఫాలో అయిన నిర్ణీత పని వేళల ఉద్యోగాన్ని వదిలేసినంత మాత్రాన ఖాళీగా కూర్చోలేదని ఛార్మీ తెలిపారు. తనకు నచ్చిన ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన పనుల కంటే ఆసక్తి ఉన్న పనులకే తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఇంటీరియర్ డిజైన్‌పై అవగాహన పెంచుకోవడం, చిన్న ఫుడ్ డెలివరీ వ్యాపారం చేయడం వంటి పనులతో తన సమయాన్ని ఫలప్రదంగా గడుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జీవితం పట్ల తన దృక్పథం పూర్తిగా మారిపోయిందన్నారు. గతంలో పరుగుల జీవితంలో అర్థం చేసుకోలేని ఎన్నో విషయాలు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ఓ స్టార్టప్ కంపెనీ పెద్ద ఉద్యోగం ఇస్తానన్నా వెళ్లలేదని ఛార్మీ వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments