గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఈకేవైసీ గడువు పెంపు!
మీరు గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ చేయించుకోలేదా? గడువు ముగుస్తుందని ఆందోళనలో ఉన్నారా? అయితే ఎల్పీజీ వినియోగదారులకు ఒక శుభవార్త చెప్పింది. ఈ-కేవైసీ ప్రక్రియకు సంబంధించిన గడువును పొడిగించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని గ్యాస్ కంపెనీలు నేరుగా వినియోగదారుల మొబైల్ నంబర్లకు సందేశాలు పంపుతున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు గడువు పెంచినట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఈకేవైసీ పూర్తి చేయాలనుకున్న వారికి ఆన్‌లైన్ సిస్టమ్‌లో సమస్యలు
గత రెండు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. గడువు ముగుస్తున్న క్రమంలో ఈకేవైసీ పూర్తి చేయాలనుకున్న వారికి ఆన్‌లైన్ సిస్టమ్‌లో సమస్యలు ఎదురైనందున ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలోనే గ్యాస్ కంపెనీలు గడువును పొడిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వినియోగదారుల మొబైళ్లకు నేరుగా మెసేజ్‌లు వస్తున్నాయి కాబట్టి చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు.

గడువు పెంచడం వినియోగదారులకు కాస్త ఊరట
ఇప్పటికే అనేకమార్లు ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులు తమ వివరాలను నవీకరించుకోవాలని ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు సూచించాయి. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే సిలిండర్ సరఫరా ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు కూడా జారీ చేశాయి. అయితే సాంకేతిక సమస్యల వల్ల చాలా మంది సమయానికి పూర్తి చేయలేకపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గడువు పెంచడం వినియోగదారులకు కాస్త ఊరట కలిగించే అంశం.
ఈకేవైసీ పేరుతో మోసాలు కూడా జరిగే అవకాశం, అలెర్ట్
అయితే ఇదే సమయంలో ఈకేవైసీ పేరుతో మోసాలు కూడా జరిగే అవకాశం ఉందని, వినియోగదారులు తమ మొబైల్‌లో వచ్చిన సందేశాలను జాగ్రత్తగా చదవాలని, నకిలీ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారానే ఈ-కేవైసీ పూర్తి చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. గడువు 23వ తేదీ వరకు పొడిగించినప్పటికీ, వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
కంపెనీల నుంచి వస్తున్న మెసేజ్‌లు వినియోగదారులకు రిలీఫ్
హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎల్పీజీ వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు .అయితే సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కారమైన తర్వాతే ప్రక్రియ సాఫీగా సాగుతుందని అంచనా. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, కంపెనీల నుంచి వస్తున్న మెసేజ్‌లు వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించాయి.

