HomeNewsసాయిపూర్‌లో కొత్త బోరు...!

సాయిపూర్‌లో కొత్త బోరు…!

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • మున్సిపల్ నిధులతో నూతన బోరుబావి
  • ఇబ్బందులు గమనించి చొరవ చూపిన స్థానిక నాయకులు
  •  మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ వార్డు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు ముగింపు పడింది. స్థానిక ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీ ప్రత్యేక నిధులతో నూతనంగా బోరుబావిని వేయించారు.

సాయిపూర్ కాలనీలో తాగునీటి ఎద్దడి ఉండడం తో, ఇబ్బందులను గమనించిన స్థానిక నాయకులు ఈ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యపై తక్షణమే స్పందించిన మున్సిపల్ యంత్రాంగం నిధులను మంజూరు చేసి, యుద్ధప్రాతిపదికన నూతన బోరుబావిని ఏర్పాటు చేయించింది. బోరుబావిలో నీరు సమృద్ధిగా పడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు మల్లప్ప, 11వ వార్డ్ కౌన్సిలర్ బంటు వేణు గోపాల్, నాయకులు పట్లోళ్ల ప్రశాంత్, మున్సిపల్ అధికారులకు ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments