HomeEntertainment‘VISA - వింటారా సరదాగా’: ‘ఖలేజా’ డైలాగ్‌తో వచ్చిన సెకండ్ టీజర్ ఎలా ఉందంటే.?

‘VISA – వింటారా సరదాగా’: ‘ఖలేజా’ డైలాగ్‌తో వచ్చిన సెకండ్ టీజర్ ఎలా ఉందంటే.?

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY


‘VISA – వింటారా సరదాగా’: ‘ఖలేజా’ డైలాగ్‌తో వచ్చిన సెకండ్ టీజర్ ఎలా ఉందంటే.?

Aug 14, 2026 7:22PM

‘VISA – వింటారా సరదాగా’ చిత్రానికి సంబంధించిన రెండో టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది.

ఉద్భవ్ రఘు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ రెండో టీజర్‌ను పూర్తిగా హీరో కోణంలో రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేమ, అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితంలో ఎదురయ్యే ‘ట్రబుల్’ గురించి అశోక్ గల్లా పాత్ర తనదైన శైలిలో చెప్పే మాటలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సహజమైన సంభాషణలు, ఆకట్టుకునే కామెడీ, మనసును హత్తుకునే  ఎమోషన్స్‌తో సాగిన ఈ మోనోలాగ్ టీజర్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది.

అయితే ఈ టీజర్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ఆసక్తికరమైన అంశం ‘ఖలేజా’ చిత్రంలోని ఐకానిక్ డైలాగ్‌కు సంబంధించిన రిఫరెన్స్. ఊహించని విధంగా వచ్చిన ఈ రిఫరెన్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం టీజర్‌లోని ఎనర్జీకి మరింత బలాన్ని చేకూర్చింది. వినోదం, ప్రేమ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ‘VISA – వింటారా సరదాగా’ రెండో టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం అక్టోబర్ 17న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

 

 

 

VISA Vintara Saradaga Teaser 2, Ashok Galla, Sri Gouri Priya, Naga Vamsi

 



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments