HomeEntertainmentలెఫ్టినెంట్ కల్నల్‌ గా వెంకటేశ్.. అనిల్ రావిపూడి మూవీ క్రేజీ పోస్టర్ రిలీజ్..

లెఫ్టినెంట్ కల్నల్‌ గా వెంకటేశ్.. అనిల్ రావిపూడి మూవీ క్రేజీ పోస్టర్ రిలీజ్..

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY


లెఫ్టినెంట్ కల్నల్‌ గా వెంకటేశ్.. అనిల్ రావిపూడి మూవీ క్రేజీ పోస్టర్ రిలీజ్..

విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 2, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. అలాగే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీలోనూ ఓ కీలక పాత్రలో వెంకటేశ్ కనిపించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబో ఏకంగా ఐదోసారి రిపీట్ కానుంది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

తాజాగా ఈ మూవీకి సంబంధించి విక్టరీ వెంకటేశ్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి తన ఎక్స్ ఖాతాలో ఈ పోస్టర్ ను విడుదల చేశారు. విక్టరీ వెంకటేశ్ 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.

ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్.. లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి అనే పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన కౌంటర్-టెర్రరిజం అలాగే హోస్టేజ్ నెగోషియేషన్ విభాగంలో స్పెషలైజేషన్ కలిగిన ఆర్మీ ఆఫీసర్‌ గా వెంకీ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోస్టర్ లో వెంకటేశ్ ఆర్మీ లుక్ లో స్టైలిష్ అలాగే పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆర్మీ కమేఫ్లేజ్ యూనిఫామ్, బ్లాక్ కంబాట్ షూస్, సన్ గ్లాసెస్ ను ధరించి చాలా ఇంటెన్స్ లుక్ లో ఆయన కనిపిస్తున్నారు.

Venkatesh as a Lieutenant Colonel Exciting poster released from Anil Ravipudi s movie Anil Ravipudi

పోస్టర్ లో చూపించినట్లు ఒక భారీ బ్లాక్ కలర్ మెర్సిడెస్- బెంజ్ కారు బంపర్ పై స్టైలిష్ వేలో కాలు పెట్టి వాచీను సరిచేసుకుంటున్నట్లుగా కనిపించారు. పోస్టర్ వెనకాల యుద్ధ వాతావరణాన్ని తలపించేలా మేఘావృతమైన ఆకాశం, ఎగురుతున్న మిలిటరీ హెలికాప్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ మూవీని షైన్ స్క్రీన్స్.. జెడ్ స్టూడియోస్ పతాకంపై సాహు గారపాటి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో నందమూరి హీరో కల్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దాంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments