HomeNewsపాత మణుగూరులో హ్యాండ్ బోర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

పాత మణుగూరులో హ్యాండ్ బోర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

జనవాహిణి ప్రతినిధి

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మణుగూరులో స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన హ్యాండ్ బోర్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన ఈ హ్యాండ్ బోర్ ద్వారా పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తగ్గి, మెరుగైన సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు పేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, మండల ముఖ్య నాయకులు, 14 టైర్ యూనియన్ నాయకులు, గుమస్తాల సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments