- నేతాజీ విగ్రహం వద్ద ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
- హిందూ వాహిని ,తాండూర్ యువకుల ఆధ్వర్యంలో వేడుకలు
- అల్పాహారం వితరణ
జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ప్రాంతం గురువారం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. హిందూ వాహిని మరియు యువకుల సంయుక్త ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా నేతాజీ విగ్రహాన్ని సుందరంగా అలంకరించి పూలమాలలు వేశారు. ఆ తర్వాత ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు.
ఈ వేడుకల సందర్భంగా కార్మికులను ప్రత్యేకంగా గౌరవిస్తూ వారికి అల్పాహారం పంపిణీ చేశారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కార్మికుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పర్యాద రామకృష్ణ, కౌన్సిలర్ జుంటుపల్లి వెంకటేష్, రజినీకాంత్, కటకం హరీష్, గుబ్బ నరేష్, రాఘవేందర్, జోషి వికాస్, అనిల్, శివకుమార్, సాయి, నవీన్, కేశవులు, హిందూవాహిని గణేష్, మధు, బన్నీ, అభిషేక్ తదితర యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
