Home News తడిసిన ధాన్యాన్ని సైతం కొంటాం…!

తడిసిన ధాన్యాన్ని సైతం కొంటాం…!

104
0
  • ఎమ్మెల్యే బీఎంఆర్ తో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ 
  • తాండూరు నియోజకవర్గ సమస్యలపై చర్చ

జనవాహిని ప్రతినిధి తాండూరు : అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులను క్షుణ్ణంగా వివరించారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు, మిల్లర్లకు మధ్య సమన్వయం ఏర్పరిచి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతులకు రూ. 45 వేల కోట్లను నేరుగా చెల్లించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఆశ్రయించాలని సూచించారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here