Home Entertainment సమంత సంచలన నిర్ణయం.. ఆ షో కోసం కళ్లుచెదిరే పారితోషకం !!

సమంత సంచలన నిర్ణయం.. ఆ షో కోసం కళ్లుచెదిరే పారితోషకం !!

4
0


సమంత సంచలన నిర్ణయం.. ఆ షో కోసం కళ్లుచెదిరే పారితోషకం !!

Google search engine

స్టార్ హీరోయిన్ సమంత.. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. నాగ చైతన్య సరసన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో సమంత ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్‌: హనీ బన్నీ అనే యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఈ రెండు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి.

కాగా రీసెంట్ గానే “మా ఇంటి బంగారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా రాజ్ నిడమోరు స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ మూవీ సక్సెస్ మీట్ లోనే తాను ప్రెగ్నెంట్ ని అంటూ గుడ్ న్యూస్ ప్రకటించింది ఈ భామ. దాంతో కొంతకాలం బ్రేక్ తప్పదని స్పష్టం చేసింది. అయితే సినిమాల నుంచి కొంత విరామం తీసుకుంటున్న సామ్.. ఓ ఓటీటీ వేదికలో కొత్త షో కి ఓకే చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

samantha-shocking-decision-about-green-signal-for-ott-talk-show-in-sony-live-and-remuneration-detail

మళ్లీ వ్యాఖ్యాతగా సమంత..

సమంత మరోసారి డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రెడీ అయినట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సోనీ లివ్ తమిళ్‌తో సమంత అగ్రిమెంట్ చేసుకున్నారని.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం చెన్నైలో ఈ షో కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. షో ఫార్మాట్ చిట్‌చాట్‌లా కాకుండా సెలబ్రిటీల వ్యక్తిగత అనుభవాలు, సంబంధాలు, కెరీర్ గురించి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇక సమంతకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కొత్తవి కాదనే చెప్పాలి. గతంలో ఆహా కోసం చేసిన ‘సామ్ జామ్’ షోలో హోస్ట్‌గా కనిపించారు. అంతే కాకుండా ఈ షో కోసం సమంత భారీ పారితోషికం అందుకోనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్‌కు కోటి రూపాయల వరకు చెల్లించనున్నారన్న ప్రచారం నడుస్తోంది. దీనిపై సమంత టీమ్ లేదా సోనీ లివ్ నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. అధికారిక నిర్ధారణ వచ్చే వరకు ఈ వివరాలను ట్రేడ్ వర్గాల అంచనాలుగానే చూడాలి.



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here