Home Entertainment ప్రీతి జింటాకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్!

ప్రీతి జింటాకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్!

2
0


ప్రీతి జింటాకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్!

Google search engine

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింటాకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఇంటర్నెట్‌లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృష్టించిన డీ‌ప్‌ఫేక్స్, మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ వీడియోలు, ఆమె గుర్తింపును దుర్వినియోగం చేస్తూ అప్‌లోడ్ చేసిన అనధికారిక కంటెంట్‌కు వ్యతిరేకంగా న్యాయస్థానం ఆమెకు తాత్కాలిక రక్షణను మంజూరు చేసింది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం కోర్టు ప్రీతి జింటాకు అనుకూలంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు సంచలన కామెంట్లు చేసింది. ఏఐని దుర్వినియోగం చేస్తూ ఫేక్ కంటెంట్‌ను సృష్టించడం ఓ వ్యక్తి పర్సనాలిటీ రైట్స్, పబ్లిసిటీ రైట్స్, గౌరవంగా జీవించే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినట్లేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఓ సెలబ్రిటీ ముఖాన్ని, రూపాన్ని వారి అనుమతి లేకుండా వాడటం వల్ల వారి ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా.. ప్రజల్లో వారిపై ఉన్న నమ్మకం కూడా సన్నగిల్లుతుందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.

Bombay High Court Grants Interim Relief for Star Heroine Preity Zinta in Deepfake Battle Full Details

ఇదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్ మధ్యవర్తులు తమ ప్లాట్‌ఫారమ్‌లు దుర్వినియోగం కాకుండా చురుగ్గా వ్యవహరించాలని.. ఐటీ నిబంధనల ప్రకారం తమ బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి అభ్యంతరకర ఫేక్ కంటెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవడం వల్ల పౌరుల హక్కులను రక్షించవచ్చని.. అలాగే పదే పదే తప్పులు చేసే నేరగాళ్లను అడ్డుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది.

విచారణ సమయంలో ప్రీతి జింటా తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి కీలక సమాచారాన్ని అందించారు. ఇంటర్నెట్‌లో వందలాది లింకులలో ప్రీతి జింటాకు సంబంధించిన ఏఐ-జనరేటెడ్ లేదా మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని.. అవి ఆమె గుర్తింపును తప్పుగా చిత్రీకరిస్తున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. సదరు నకిలీ కంటెంట్ ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది.

అయితే భవిష్యత్తులో వచ్చే కంప్లయింట్లలో ఏదైనా నిజమైన కంటెంట్ ఉన్నట్లయితే.. గూగుల్, మెటా వంటి కంపెనీలు తమ చట్టపరమైన అభ్యంతరాలను లేవనెత్తేందుకు న్యాయస్తానం అనుమతించింది. ఒకవేళ అలాంటి అభ్యంతరాలు వస్తే.. నటి ప్రీతి జింటా తదుపరి ఆదేశాల కోసం మళ్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. డిజిటల్ ప్రపంచంలో ఏఐ డీప్ ఫేక్స్ ముప్పును అరికట్టేందుకు, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులను రక్షించేందుకు కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఓ కీలకమైన అడుగుగా భావించవచ్చు.



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here