Home News పార్టీ బలోపేతమే నా లక్ష్యం…!

పార్టీ బలోపేతమే నా లక్ష్యం…!

171
0
  • జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ‘కావాలి సంతోష్’
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ధారాసింగ్‌లకు కృతజ్ఞతలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా కావాలి సంతోష్ నియమితులయ్యారు. పార్టీలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం, జిల్లా కమిటీలో కీలకమైన ఈ బాధ్యతను అప్పగించింది. తన నియామకానికి సహకరించిన తాండూరు ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ లకు సంతోష్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా కావాలి సంతోష్ మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తనైన తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించినందుకు పార్టీ పెద్దలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ప్రభుత్వ ప్రజా రంజక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధిలోనూ, పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటానని వెల్లడించారు.కావాలి సంతోష్ నియామకం పట్ల మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పార్టీ పెద్దలకు, సన్నిహితులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here