Home News సరళ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ అధ్యక్షురాలు..!

సరళ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ అధ్యక్షురాలు..!

235
0
  • ఆర్‌బీఓఎల్ ఎండీ సరళా రెడ్డి జన్మదిన వేడుకలు
  • కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి ఆధ్వర్యంలో ఆర్‌బీఓఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సరళా రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఆర్‌బీఓఎల్ సీఈవో శ్రీనివాసరెడ్డి సతీమణి అయిన సరళా రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని, తాండూరులోని వారి నివాసంలో పట్టణ మహిళా కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా సరళా రెడ్డి చేత కేక్ కట్ చేయించి, మిఠాయిలు పంపిణీ చేశారు. పట్టణ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాధవి మాట్లాడుతూ.. సరళా రెడ్డి మరిన్ని పుట్టినరోజులు ఇలాగే ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని సరళా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here