spot_img
HomeEntertainmentవీఐ ఆనంద్‌తో రోషన్ కనకాల భారీ మూవీ.. పాన్ ఇండియా షేక్ అయ్యే కాన్సెప్ట్.!

వీఐ ఆనంద్‌తో రోషన్ కనకాల భారీ మూవీ.. పాన్ ఇండియా షేక్ అయ్యే కాన్సెప్ట్.!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి


వీఐ ఆనంద్‌తో రోషన్ కనకాల భారీ మూవీ.. పాన్ ఇండియా షేక్ అయ్యే కాన్సెప్ట్.!

Jul 10, 2026 4:56PM

కొన్ని సినిమాలు ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, ప్రేమ, మిస్టరీ కలిసిన అలాంటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న ఓ భారీ కాన్సెప్ట్ సినిమా ఘనంగా ప్రారంభమైంది.
 
రోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ అధికారికంగా లాంచ్ అయ్యింది. సత్య, సుదర్శన్, రవి తేజ నన్నిమాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ కె కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన విజయ్, ‘టైగర్’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ఆయన దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.  

టాలీవుడ్ లో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ సినిమాల స్థాయిని తన వినూత్న స్టొరీ టెల్లింగ్ తో మార్చిన విఐ ఆనంద్ అందించిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. గుత్తా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలాజీ గుట్ట,  కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సహకారం అందిస్తోంది. ఆసక్తికరమైన కాన్సెప్ట్, భారీ స్థాయి నిర్మాణంతో ఈ చిత్రం సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.

కాకతీయ హిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. హీరో నిఖిల్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. విఐ ఆనంద్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేయడమే కాకుండా, ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించారు.

ఫాంటసీ, రొమాన్స్, కామెడీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం, ఊహలు, భావోద్వేగాలు, అద్భుతమైన దృశ్యాలతో కూడిన ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లనుంది. పూర్తి స్థాయి థియేట్రికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, ప్రతి భావోద్వేగం చెరగని ముద్ర వేస్తుందని చిత్ర బృందం హామీ ఇస్తోంది.

ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా.. అన్వేష్ వరాల సినిమాటోగ్రాఫర్ గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 

 

 

Roshan Kanakala, VI Anand, Tollywood, TeluguOne

 



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments