spot_img
HomeEntertainmentకొరియన్ కనకరాజు.. మెగా హారర్ కామెడీ రిలీజ్ డేట్ ఫిక్స్.!

కొరియన్ కనకరాజు.. మెగా హారర్ కామెడీ రిలీజ్ డేట్ ఫిక్స్.!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి


కొరియన్ కనకరాజు.. మెగా హారర్ కామెడీ రిలీజ్ డేట్ ఫిక్స్.!

Jul 10, 2026 4:26PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి ఆయన ఒక వైల్డ్ రైడ్‌తో ముందుకు రాబోతున్నారు. ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ హారర్ కామెడీ మూవీ ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో విడుదలై ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 ఆగస్టు 7న ఈ వైల్డెస్ట్ హారర్ కామెడీ రైడ్‌ ప్రేక్షకులు ముందుకు రానుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. పోస్టర్‌లో వరుణ్ తేజ్ ఒక లగ్జరీ కుర్చీలో రస్టిక్ అండ్ స్టైలిష్ లుక్‌తో కూర్చొని ఉన్నారు. కోర మీసం, లుంగీ కట్టు, చేతిలో కత్తితో వరుణ్ తేజ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటేనే ఇదొక విభిన్నమైన ఇండో-కొరియన్ కల్చరల్ మిక్స్ అని, హారర్ ఎలిమెంట్స్‌తో సరికొత్తగా సినిమా సాగనుందని స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. తనదైన మార్క్ హిలేరియస్ కామెడీతో వినోదాన్ని పంచడంలో దిట్ట అయిన ఆయన, ఈసారి హారర్ ఎలిమెంట్స్, కొరియన్ డ్రామాను మిక్స్ చేసి సరికొత్త మ్యాజిక్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అందాల భామ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని అందిస్తున్నారు. హారర్ కామెడీ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందుకే థమన్ తన మార్క్ అదిరిపోయే రీ-రికార్డింగ్, సాంగ్స్‌తో ఈ చిత్రాన్ని మరో లెవెల్‌కు తీసుకువెళ్లనున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఇండో-కొరియన్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ అండ్ కామెడీ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఆగస్టు 7న రాబోతున్న ఈ క్రేజీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Varun Tej, Korean Kanakaraju, Merlapaka Gandhi, Ritika Nayak, TeluguOne

 





Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments