Saturday, March 28, 2026

కాంగ్రెస్ అంటేనే కరెంటు ఉండదా…?

-

spot_img
spot_img
spot_img
  • తాండూరులో ‘కరెంటు’ దోబూచులాట
  • పది నిమిషాల్లో మూడుసార్లు ‘ప్యాకప్’!
  • కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలు అంటున్న స్థానికులు 
  • కెసిఆర్ ను గుర్తు చేస్తున్న తాండూరు ప్రజానీకం 

జనవాహిని ప్రతినిధి తాండూరు : కాంగ్రెస్ అంటేనే కరెంటు ఉండదు అనే మాట ప్రస్తుతం నిజమే అనిపిస్తుంది. మండుతున్న ఎండల తీవ్రతలో విద్యుత్ అధికారులు కొత్త రకం ‘మ్యూజికల్ చైర్స్’ ఆట కనిపెట్టారు. కాకపోతే ఇక్కడ కుర్చీలు మారవు.. కరెంటు స్విచ్‌లు మాత్రం టకటక మారుతుంటాయి. పది నిమిషాల గ్యాప్‌లో మూడుసార్లు కరెంటు తీస్తూ, ప్రజల ఓపికకు ‘షాక్’ ఇస్తున్నారు.సాధారణంగా పెళ్లిళ్లలో డిస్కో లైట్లు వెలుగుతూ ఆరుతుంటాయి. కానీ తాండూరులో కరెంటు కూడా అలాగే వెలుగుతూ ఆరుతోంది. ఏదైనా రిపేర్ ఉందా అంటే అదీ లేదు.. మరి ఎందుకు తీస్తున్నారంటే “అది మా ఇష్టం.. మా చేతిలో స్విచ్ ఉంది కదా!” అన్నట్టుగా ఉంది అధికారుల తీరు. పట్టణంలో రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే కరెంటు ఉంచి, మిగతా 20 గంటలు ప్రజలను ‘చీకటి సామ్రాజ్యానికి’ రాజులను చేస్తున్నారు.ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు పనుల కోసం వెళ్తే, అక్కడ సీన్ మామూలుగా లేదు. అధికారులు సీట్లలో కూర్చుని “కరెంటు లేదు బాబూ.. మేమేం చేయలేం” అంటూ ఆగిపోయిన ఫ్యాన్ కింద కూర్చుని చేతులెత్తేసి ధ్యానం చేస్తున్నారు. కంప్యూటర్లు వెలగవు.. సంతకాలు పడవు. సామాన్యుడు మాత్రం ఎండలో చెమటలు కక్కుతూ అధికారుల వైపు, ఆగిపోయిన ఫ్యాన్ల వైపు దీనంగా చూస్తున్నాడు. తాండూరులో వ్యాపారాలు చేసే వారు వేడికి చెమటలు కక్కుతూ… తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నాం కదా.. అంటే వాడుకోవడానికి అసలు కరెంటు ఉంటే కదా సార్!” అని జనం సెటైర్లు వేస్తున్నారు.ఈవిధంగానే కరెంటు పోయిన ప్రతిసారీ జనం ఆకాశం వైపు చూస్తూ.. “అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు తిప్పలు ఉండేవి కావు కదా!” అని పాత రోజులను నెమరువేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు తాండూరులో ఒక ‘నిరంతర ప్రక్రియ’గా మారిపోయింది. ఉన్న ప్రభుత్వం పై నిప్పులు చల్లుతు…. గత ప్రభుత్వ ను విద్యుత్ విషయం లో ప్రజలు తలపై పెట్టుకుంటున్నారు. ఎండలు మండిపోతున్నాయి.. కరెంటు రావడం లేదు. అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్టు ఏసీ రూముల్లో (బహుశా అక్కడ ఇన్వర్టర్లు ఉన్నాయేమో!) సేద తీరుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు కళ్ళు తెరిచి ఈ ‘చీకటి’ రాజకీయాన్ని ఆపకపోతే, జనం తమ చేతిలో ఉన్న ‘పవర్’ చూపిస్తారని హెచ్చరిస్తున్నారు..! ఇంకా ఈ కరెంటు కష్టాల ఎన్నాళ్ళో, రోజు రోజుకు పెరుగుతున్న ఎండకు మా పరిస్థితి ఎం అవుతుందో అంటూ ఛాయ్ షాప్ లో కూర్చున్న కొందరు గుసగుసలాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories