spot_img
HomeEntertainmentఅఖిల్ 'లెనిన్' మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్: సమంత పోస్టు వైరల్

అఖిల్ ‘లెనిన్’ మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్: సమంత పోస్టు వైరల్

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి


అఖిల్ ‘లెనిన్’ మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్: సమంత పోస్టు వైరల్

అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీకి ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పోస్టు పెట్టారు. ఈ మేరకు తన అధికారిక ఇన్ స్టా అకౌంట్ లో స్టేటస్ పెట్టారు. లెనిన్ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పుడు సమంత పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

‘ఏమాయే చేశావే’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు సమంత పరిచయం అయ్యారు. ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించారు. ఈ మూవీ తర్వాత నాగ చైతన్య, సమంత మధ్య ప్రేమాయణం స్టార్ట్ అయింది. అలా 2017 లో ఇరువురూ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే పలు కారణాలతో ఈ జంట 2021 లో విడిపోయింది. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీతో సమంత బంధాలు పూర్తిగా తెంచుకున్నారు. కానీ తాజాగా అక్కినేని అఖిల్ సినిమాకు సమంత ఆల్ ది బెస్ట్ చెప్పడం ఇప్పుడు అటు సామాజిక మాధ్యమాల్లో ఇటు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చర్చనీయాశంగా మారింది.

మరోవైపు ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. జూన్ 19 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ తక్కువ రోజుల్లోనే ఏకంగా రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సృష్టించింది. ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా కలెక్షన్స్ రాబడుతోంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ తో మా ఇంటి బంగారం 2 సినిమాను కూడా తెరకెక్కిస్తామని సమంత భర్త, నిర్మాత రాజ్ నిడిమోరు ఇటీవల స్పష్టం చేశారు.

Samantha post declaring Akhil s Lenin movie blockbuster already has gone viral she all the best

ఇక లెనిన్ సినిమాలో అఖిల్ సరసన భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా నటించారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయాలని నమోదు చేస్తుందో చూడాలి.



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments