HomeNewsనిరంజన్ గౌడ్ మృతిపై బి.ఎస్.ఆర్ దిగ్భ్రాంతి..!

నిరంజన్ గౌడ్ మృతిపై బి.ఎస్.ఆర్ దిగ్భ్రాంతి..!

  • నిరంజన్ గౌడ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు: బి.ఎస్.ఆర్ సంతాపం 
  • నిరంజన్ గౌడ్ భౌతికకాయానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు బి.ఎస్.ఆర్

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అయ్యప్ప నగర్ నివాసి నిరంజన్ గౌడ్ అకాల మరణం పట్ల ఆర్ బి ఓ ఎల్ సంస్థ అధినేత, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిరంజన్ గౌడ్ మరణవార్త విన్న వెంటనే బి.ఎస్.ఆర్ వారి స్వగృహానికి చేరుకుని, భౌతికకాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిరంజన్ గౌడ్ పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మరణం పార్టీకి మరియు వ్యక్తిగతంగా ఆయనకు తీరని లోటు, అని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, నిరంజన్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments