HomeNewsభక్తిభావంతో హనుమాన్ దీక్షలు...!

భక్తిభావంతో హనుమాన్ దీక్షలు…!

  • భక్తిశ్రద్ధలతో హనుమాన్ దీక్షల ప్రారంభం
  •   తాండూర్, బషీరాబాద్ మండలాల్లో మాలధారణ చేసిన యువకులు
  •   అర్ధమండల దీక్షలతో స్వామివారి అనుగ్రహం: మీదిపేట వినోద్ కుమార్

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణం మరియు బషీరాబాద్ మండల కేంద్రాల్లో హనుమాన్ అర్ధమండల దీక్షలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి. హనుమాన్ దీక్షా సమితి ఆధ్వర్యంలో గురువారం పలువురు యువకులు భక్తిశ్రద్ధలతో స్వామివారి మాలను ధరించారు. తాండూర్ పట్టణంలో సుమారు 8 మందికి పైగా యువకులు, బషీరాబాద్ మండలంలో 9 మంది యువకులు ఈ దీక్షలను చేపట్టారు.ఈ సందర్భంగా హనుమాన్ దీక్షా సమితి సభ్యులు మీదిపేట వినోద్ కుమార్ మాట్లాడుతూ.. హనుమంతుని అనుగ్రహం పొందడానికి అర్ధమండల దీక్షలు ఎంతో విశిష్టమైనవని పేర్కొన్నారు. దీక్షా కాలంలో భక్తులు పాటించాల్సిన కఠిన నియమ నిష్టల గురించి ఆయన వివరించారు. ఈ దీక్షలు వచ్చే నెలలో జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల వరకు కొనసాగుతాయని తెలిపారు. దీక్షా కాలం పూర్తయిన తర్వాత భక్తులందరూ నల్లమల అడవుల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుంటారని నిర్వాహకులు వెల్లడించారు. అక్కడ ‘పవన ముడి’ సమర్పించి తమ దీక్షలను విరమిస్తారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments