HomeEntertainmentఎస్‌.పి.బాలుని ఆటపట్టించిన ఎస్.జానకి.. ఆ అరుదైన ఫోన్ కాల్ వెనుక అసలు కథ ఇదే.!

ఎస్‌.పి.బాలుని ఆటపట్టించిన ఎస్.జానకి.. ఆ అరుదైన ఫోన్ కాల్ వెనుక అసలు కథ ఇదే.!

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO


ఎస్‌.పి.బాలుని ఆటపట్టించిన ఎస్.జానకి.. ఆ అరుదైన ఫోన్ కాల్ వెనుక అసలు కథ ఇదే.!

Jul 12, 2026 10:44AM

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లెజెండరీ సింగర్ ఎస్. జానకిల కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి వెండితెరపై వేలాది అమృత గీతాలను ఆలపించి, సంగీత ప్రపంచాన్ని ఏలారు. కేవలం పాటల పరంగానే కాకుండా, వీరి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం కూడా ఎంతో గొప్పది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అరుదైన లైవ్ ఇంటర్వ్యూ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలిచింది.

టోరి (Tori) లైవ్ రేడియో కార్యక్రమంలో బాలు మాట్లాడుతుండగా, హైదరాబాద్ నుంచి ఒక గుర్తుతెలియని కాలర్ లాగా జానకమ్మ లైన్ లోకి వచ్చి అద్భుతమైన ప్రాంక్ కాల్ చేశారు. మొదట సాధారణ శ్రోతలాగా “హలో అండి, నేను జానకిని మాట్లాడుతున్నాను” అంటూ పరిచయం చేసుకోగా, బాలు ఆ గొంతును గుర్తుపట్టలేక సాధారణంగానే పలకరించారు. కానీ, వెంటనే ఆవిడ “నేను సింగర్ జానకిని నాన్న” అని చెప్పడంతో బాలు ఒక్కసారిగా షాక్‌కు గురై తీవ్రమైన ఆనందానికి లోనయ్యారు.

https://www.youtube.com/watch?v=0zaLTYxEhRg

బాలు నటించిన క్లాసిక్ ఎమోషనల్ డ్రామా ‘మిథునం’ సినిమాను చూసిన జానకమ్మ, ఆ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని లైవ్ లోనే అభినందించారు. లక్ష్మి, ఎస్పీ బాలు తప్ప మూడో పాత్రే లేకుండా కేవలం 2 క్యారెక్టర్లతో డైరెక్టర్ తనికెళ్ళ భరణి ఈ అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారని ఆవిడ కొనియాడారు. పిల్లలందరూ విదేశాలలో స్థిరపడితే, ఇక్కడ ఒంటరిగా ఉండే ఒక వృద్ధ దంపతులు రోజువారీ జీవితంలో ఒకరికొకరు ఎలా తోడుగా నిలిచారు, వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఎలాంటివి అనే థీమ్ తనకు ఎంతో కనెక్ట్ అయిందని ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన అవసరం ఉందని, థియేటర్లలో 100 రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఆడి సిల్వర్ జూబ్లీ జరుపుకోవాల్సిన సినిమా ఇదని జానకమ్మ ప్రశంసల జల్లు కురిపించారు.

జానకమ్మ నోట ఈ మాటలు విన్న ఎస్పీ బాలు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. వశిష్టుడి నోటి నుండి బ్రహ్మర్షి అనే ఆశీర్వాదం వచ్చినంత సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. తాను సినిమాల్లోకి రావడానికి, పాట‌ల‌ వైపు అడుగులు వేయడానికి తన మెదడులో మొదటి విత్తనం నాటిన వ్యక్తి జానకమ్మేనని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ఆవిడతో కలిసి వేలాది పాటలు పాడుతూ ఎంతో నేర్చుకున్నానని, ఎంతో ఆనందించానని చెప్పారు.

అలాంటి మహోన్నతమైన గాయని, ఈ అర్ధరాత్రి పూట లైవ్ ప్రోగ్రాం చూస్తూ తన సినిమా కోసం ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడటం తాము చేసుకున్న అదృష్టమని, ఇందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని బాలు తెలిపారు. లక్ష్మి లాంటి గొప్ప నటికి సమానంగా బాలు కూడా ఎంతో సహజంగా, అద్భుతంగా నటించాడని జానకమ్మ మెచ్చుకోగా, ఆవిడ చూపించిన ఆప్యాయతకు బాలు చేతులెత్తి నమస్కరించారు.



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments