HomeEntertainmentసింగర్ ఎస్.జానకి చివరి కోరిక ఇదేనా.. తీరకుండానే !!

సింగర్ ఎస్.జానకి చివరి కోరిక ఇదేనా.. తీరకుండానే !!

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO

సింగర్ ఎస్.జానకి చివరి కోరిక ఇదేనా.. తీరకుండానే !!

దిగ్గజ గాయని ఎస్.జానకి మృతితో చిత్రపరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా కొద్దిరోజుల క్రితమే ఆమె కైక కుమారుడు మురళీ కృష్ణ చనిపోయారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆమెను వృద్ధాప్య సమస్యలు మరింత క్రుంగదీశాయి. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 88 సంవత్సరాలు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

కాగా ఎస్ జానకి పూర్తి పేరు శిష్ట్లా జానకి. ఏప్రిల్ 23, 1938 గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్రీరామమూర్తి, శకుంతలమ్మ. భర్త వి. రామ్‌ప్రసాద్ 1992లో మరణించగా.. మురళీకృష్ణ రీసెంట్ గానే మృతిచెందారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్’ అవార్డును ఆమె తిరస్కరించారు. దశాబ్దాల సేవకు గానూ తనకు చాలా ఆలస్యంగా ఈ అవార్డు ఇచ్చారని, దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె నిరసన వ్యక్తం చేశారు.

legendary-singer-s-janaki-passes-away-due-to-cardiac-arrest-and-details-about-her-last-wish-also-fil

1957లో విడుదలైన ‘విధియిన్ విలయాడల్’ అనే తమిళ చిత్రం ద్వారా ఆమె గాయనిగా పరిచయమయ్యారు. తెలుగులో ఆమె మొదటి పాట ‘ఎమ్మెల్యే’ (1957) చిత్రంలోని “నీ ఆశ అడియాస పాయెనే మోసమాయెనే”. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు సుమారు 17కు పైగా భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. తన 60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 48,000 కంటే ఎక్కువ పాటలను ఆలపించారు. ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ అవార్డులు.. ఏపీ ప్రభుత్వం నుంచి 10కి పైగా నంది అవార్డులు.. కేరళ ప్రభుత్వం నుండి 14 సార్లు.. తమిళనాడు ప్రభుత్వం నుండి 7 సార్లు రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు.

చివరి కోరిక ఇదే..

జానకి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తనకు ఏ కోరికలు లేవని, నిండైన జీవితాన్ని చూశానని తెలిపారు. అయితే “నేను ఎవరు?” అని తెలుసుకోవాలనే ఆకాంక్ష మాత్రమే తనకు మిగిలిందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఇదేనని, మనం ఈ దేహం కాదని, మనలో ఉండే పరమాత్మను తెలుసుకోవాలని ఆమె తెలిపారు. ఈ దేహం ఒక కారణంతో వస్తుందని, కానీ నిజమైన మన అస్తిత్వం పరమాత్మలోనే ఉందని ఆమె విశ్వసించారు. ఈ జ్ఞానం లభిస్తే ఇంక జీవించాల్సిన అవసరం ఉండదని, అది తెలిసే వరకు ఈ దేహాన్ని కాపాడమని ప్రార్థించాలన్నారు. ఆత్మ మళ్ళీ పుడుతుందని.. ఆత్మ పరమాత్మలో ఐక్యం కావాలంటే పరమాత్మ ఎవరని మనం తెలుసుకోవాలి అని ఆమె తన ఆధ్యాత్మిక చింతనను పంచుకున్నారు.

ఇక జానకి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూర్‌లోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్‌కు తీసుకొచ్చారు. సా.4 గం. వరకు అక్కడే ఉంచనున్నారు. తమ అభిమాన గాయని చివరిచూపు కోసం పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకొని నివాళి అర్పిస్తున్నారు. కణియర హుండి గ్రామంలోని ఫామ్ హౌస్‌లో 5 గంటలకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments