HomeNewsసొంత గూటికి చేరిన ఎబినైజర్...!

సొంత గూటికి చేరిన ఎబినైజర్…!

  • కాంగ్రెస్‌లోకి జోగుల ఎబినైజర్..! 
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో చేరిక

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ రాజకీయాల్లో యువనేత జోగుల ఎబినైజర్ తిరిగి తన సొంతగూటికి చేరుకున్నారు. గతంలో ఎన్ఎస్యుఐ వికారాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ గా క్రియాశీలకంగా పనిచేసి, కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎబినైజర్, మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా జోగుల ఎబినైజర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో యువతకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని విమర్శించారు. యువతను కేవలం వాడుకుని మోసం చేస్తున్నారని, అక్కడ ఆత్మగౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే యువతకు గుర్తింపు, భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతోనే తిరిగి తన పాత గూటికి వచ్చానని స్పష్టం చేశారు.రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు వేసే ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొంటామని ఎబినైజర్ ధీమా వ్యక్తం చేశారు.ప్రతిపక్షాల కుట్రలను, అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామన్నారు. విపక్షాల ప్రతి వ్యూహానికి మా వద్ద బలమైన ప్రతివ్యూహం సిద్ధంగా ఉంది, అని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments