HomeNewsహ్యాపీ బర్తడే తమ్ముడు...!

హ్యాపీ బర్తడే తమ్ముడు…!

  • రాజకీయాల హోరు.. తమ్ముడిపై ప్రేమ జోరు
  • అన్నదమ్ముల అనుబంధానికి వేదికైన ‘బ‌ర్త్‌డే’!

జనవాహిని ప్రతినిధి తాండూరు : నిత్యం ప్రజల మధ్య ఉంటూ, నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉండే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాసేపు ‘రాజకీయ నాయకుడి’ ముసుగును పక్కన పెట్టారు. తన ప్రియతమ సోదరుడు శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఒక మమతల అన్న’గా మారిపోయారు. సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, తన చేతుల మీదుగా కేక్ తినిపించి అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో చాటి చెప్పారు.ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఇచ్చే ప్రాముఖ్యతలో మనోహర్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కేవలం వేడుకలుగానే కాకుండా, ఆత్మీయతకు వేదికగా నిలిచాయి. కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే తన తమ్ముడికి ఆత్మీయ ఆలింగనం చేసుకొని, నా తమ్ముడు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ, ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనసారా ఆశీర్వదించారు.ఎమ్మెల్యే తన సోదరుడికి కేక్ తినిపిస్తున్న దృశ్యాన్ని చూసి అక్కడున్న కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మురిసిపోయారు. అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి, అంటూ అందరూ చర్చించుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అభిమానులు, నాయకులు శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ పూలమాలలతో ముంచెత్తారు.

📰

ప్రభంజనం • ఈ-పేపర్ డిజిటల్ క్లిప్

ఈ వార్తను వాస్తవిక పత్రికా పేపర్ లేదా సోషల్ మీడియా పోస్టర్‌గా మార్చి షేర్ చేయండి

💬 WhatsApp
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments