HomeEntertainmentకింగ్ కొడుకు కుమ్మేశాడు.. అయ్యగారే నెం 1.. ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదన్నా..!

కింగ్ కొడుకు కుమ్మేశాడు.. అయ్యగారే నెం 1.. ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదన్నా..!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి


కింగ్ కొడుకు కుమ్మేశాడు.. అయ్యగారే నెం 1.. ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదన్నా..!

అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 10 న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. చాలా ఏళ్ల తర్వాత అఖిల్ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.. కింగ్ కొడుకు కొట్టేశాడు.. కింగ్ కొడుకు కుమ్మేశాడు.. అయ్యగారే నెంబర్ 1 అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమాకు మంచి టాక్ రావడంతో టికెట్స్ భారీగా సేల్ అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో గంటకు 16 వేల టికెట్లు అమ్ముడు కావడం విశేషం. అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఈ రేంజ్ కలెక్షన్స్ అక్కినేని అఖిల్ కెరీర్ లో ఊహించలేదనే చెప్పాలి. ఈ వీకెండ్ కు లెనిన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులపడం ఖాయంగా కనిపిస్తోంది.

ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ మూవీకి తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 8 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంటే షేర్ వసూళ్లు రూ. 5 నుంచి రూ. 6 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. అటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో లెనిన్ మూవీకి భారీ ఓపెనింగ్స్ నమోదవుతున్నాయి. ఒక్క ఉత్తరాంధ్ర నుంచే ఈ మూవీకి రూ. 50 లక్షలకు పైగానే ఫస్ట్ డే షేర్లు రానున్నట్లు స్పష్టం అవుతోంది.

AkkineniAkhil Lenin has secured sensational opening just look at the scale of its gross collections

అలాగే అటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, గోదావరి జిల్లాలు కలిపి ఈ మూవీకి మరో రూ. 2 కోట్ల 50 లక్షల రూపాయల రేంజ్ లో వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి అఖిల్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రానున్నట్లు సమాచారం. ఇక నైజాం ప్రాంతంలోనూ రూ. 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని తెలుస్తోంది. టాక్ బాగుండటంతో వీకెండ్ లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకెళ్తోంది లెనిన్ మూవీ. మరోవైపు లెనిన్ తో అఖిల్ తన నటనలో పరిణతి పొందాడని ప్రేక్షకులు చెబుతున్నారు. అఖిల్ స్క్రీన్ ప్రజెన్స్, ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్టులు బాగున్నాయని.. ఇక సెకండాఫ్ ఓ రేంజ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. మరి లెనిన్ మూవీ రానున్న రోజుల్లో ఎన్ని రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి..



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments