Home News గడప గడప నుండి పరిగి సభకు….!

గడప గడప నుండి పరిగి సభకు….!

167
0
  • పరిగి సభకు ‘కాంగ్రెస్’ జనప్రవాహం
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తరలిన మున్సిపల్ శ్రేణులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : పరిగిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నేతృత్వంలో తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు బయలుదేరారు.మున్సిపాలిటీలోని 36 వార్డులకు చెందిన కౌన్సిలర్లు, వార్డ్ ఇంచార్జ్ లు తమ పరిధిలోని కార్యకర్తలతో కలిసి వాహనాల్లో సభకు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించగా, పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్‌తో పరిగి వైపు కదిలాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సీఎం సభకు భారీ జనసమీకరణ ద్వారా తమ బలాన్ని చాటాలని కాంగ్రెస్ నాయకులు ఉత్సాహం ప్రదర్శించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల నుండి కాంగ్రెస్ జెండాలతో కార్యకర్తలు నినాదాలు చేస్తూ సభకు పయనమయ్యారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here