Tuesday, May 26, 2026

― Advertisement ―

భట్టి విక్రమార్కను కలిసిన నయీమ్ ఆఫూ..!

తాండూరు ప్రగతిపై ఉప ముఖ్యమంత్రితో చర్చ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు: నయీమ్ ఆఫూ జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను...
HomeNEWSరేపు తాండూరుకు కేటీఆర్...!

రేపు తాండూరుకు కేటీఆర్…!

spot_img
  • రోడ్ షోను విజయవంతం చేయాలి
  • ​ పార్టీ శ్రేణులకు పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపు
  • ​ వార్డు ఇన్చార్జీలు, కౌన్సిలర్ అభ్యర్థులతో ముమ్మర ఏర్పాట్లు

జనవాహిని ప్రతినిధి తాండూరు : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు (ఆదివారం) తాండూరు పట్టణంలో నిర్వహించనున్న రోడ్ షోను చారిత్రాత్మక విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన తాండూరులో కౌన్సిలర్ అభ్యర్థులు, మున్సిపల్ ఎన్నికల వార్డు ఇన్చార్జీలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 9:00 గంటలకు తాండూరులోని ఇందిరా చౌక్ వేదికగా కేటీఆర్ రోడ్ షో ప్రారంభమవుతుందని తెలిపారు. తాండూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని, ఈ రోడ్ షో విజయంతో ప్రతిపక్షాలకు గట్టి సమాధానం చెప్పాలని ఆయన కార్యకర్తలను ఉత్సాహపరిచారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు స్వచ్ఛందంగా, పెద్ద ఎత్తున తరలివచ్చి మన నాయకుడికి ఘనస్వాగతం పలకాలని కోరారు. వార్డు ఇన్చార్జీలు తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, జనసమీకరణలో చురుగ్గా పాల్గొనాలన్నారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఈ రోడ్ షో ఒక దిక్సూచిలా మారుతుందని, అందరం కలిసికట్టుగా కృషి చేసి తాండూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేద్దామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పట్టణంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.