Home News ప్రచారంలో దూకుడు పెంచిన పైలెట్..!

ప్రచారంలో దూకుడు పెంచిన పైలెట్..!

99
0
  • 25వ వార్డులో పైలెట్ రోహిత్ రెడ్డి ఎన్నికల శంఖారావం
  • ​బీఆర్ఎస్ అభ్యర్థి నసీరా భానును గెలిపించాలని ఇంటింటా ప్రచారం

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈరోజు పట్టణంలోని 25వ వార్డులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అయిజాజ్ తల్లి నసీరా భాను మద్దతుగా ఆయన వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.​వార్డులోని ప్రతి గల్లీలో తిరుగుతూ, ప్రతి ఇంటి యజమానిని కలుస్తూ నసీరా భానును భారీ మెజారిటీతో గెలిపించాలని రోహిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వార్డు అభివృద్ధి చెందాలన్నా, ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం అవసరమని ఆయన పేర్కొన్నారు.​ప్రచారంలో భాగంగా వార్డులోని పలువురు ముఖ్య నాయకులు, ప్రభావవంతమైన కుటుంబాలను రోహిత్ రెడ్డి వ్యక్తిగతంగా కలిశారు. నసీరా భానుకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.​పైలెట్ రోహిత్ రెడ్డి రాకతో వార్డులోని బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

 

Google search engine
ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here