Home News గడప గడపకూ ‘కారు’ జోరు….! 

గడప గడపకూ ‘కారు’ జోరు….! 

154
0
  • సాయిపూర్‌లో పట్లోళ్ల దీప, నర్సింహులు ప్రచారం
  • సాయిపూర్‌లో ‘గులాబీ’ జోరు
  • ఇంటింటి ప్రచారంలో పట్లోళ్ల దీప, నర్సింహులు
  • అభివృద్ధే లక్ష్యం.. కారు గుర్తుకే మా ఓటు: సాయిపూర్ వాసుల మద్దతు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 9, 10వ వార్డు పరిధిలోని సాయిపూర్ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. 9, 10వ వార్డుల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్లోళ్ల దీప, చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింహులు మంగళవారం వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. వార్డుల్లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, సిసి రోడ్లు మరియు తాగునీటి ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరువ కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ప్రచారంలో మహిళా ఓటర్లు అభ్యర్థి పట్లోళ్ల దీపకు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.వార్డు ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ, తాము అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో ప్రచారంలో పాల్గొని పరిసరాలను గులాబీమయం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here