Wednesday, February 4, 2026
Home NEWS బిఆర్ఎస్ అభ్యర్థులు వీళ్ళే…!

బిఆర్ఎస్ అభ్యర్థులు వీళ్ళే…!

0
727
  • బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు…! 
  • 36 వార్డులకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్టానం
  • సామాజిక సమీకరణాలకు పెద్దపీట
  • బరిలో గెలుపు గుర్రాలు.. మహిళలకు ప్రాధాన్యత

జనవాహిని ప్రతినిధి తాండూరు :  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ తన అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 36 వార్డులకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తూ పార్టీ ముఖ్య నాయకులు నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో బలం ఉన్న నాయకులను, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ఈ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది.ప్రకటించిన జాబితాలో మహిళా అభ్యర్థులకు అత్యంత ప్రాధాన్యత లభించింది. దాదాపు 18 వార్డులలో మహిళలు బరిలో నిలవగా, జనరల్ మరియు బీసీ కేటగిరీల్లో సైతం విద్యావంతులకు, సేవా దృక్పథం ఉన్నవారికి చోటు కల్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన సముచిత స్థానం కల్పించామని పార్టీ వర్గాలు తెలిపాయి.

వార్డుల వారీగా అభ్యర్థుల వివరాలు:1వ వార్డు నుంచి 36వ వార్డు వరకు అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి:

వార్డు 1-10: నాగ లక్ష్మి (వార్డు 1), వినయ శీల (వార్డు 2), నిషా టునీసా (వార్డు 3), అనుష భాయి (వార్డు 4), ఇర్ఫానా బేగం (వార్డు 5), అనిల్ ఆర్మీ (వార్డు 6), ఇర్షాద్ (వార్డు 7), జావీద్ (వార్డు 8), దీప నర్సిములు (వార్డు 9), సాయిపూర్ నర్సిములు (వార్డు 10).

వార్డు 11-20: రాజేష్ చారి (వార్డు 11), ఎండి యూసఫ్ బాబా (వార్డు 12), సురేష్ నాయక్ (వార్డు 13), నాజియా సారా (వార్డు 14), శోభా రాణి (వార్డు 15), వసంత (వార్డు 16), అఫ్రీన్ బేగం (వార్డు 17), సంజు (వార్డు 18), బాంబినో (వార్డు 19), నవీనా (వార్డు 20).

వార్డు 21-30: టిప్పు (వార్డు 21), భాస్కర్ (వార్డు 22), పర్మిల (వార్డు 23), కోత్రికె నాగ లక్ష్మి (వార్డు 24), నసీరా భాను (వార్డు 25), రూపాలి (వార్డు 26), సుకన్య (వార్డు 27), అనురాధ (వార్డు 28), సిద్ధు గౌడ్ (వార్డు 29), సబియా ఫాతిమా (వార్డు 30).

వార్డు 31-36: యోగానంద్ (వార్డు 31), మహేశ్వరి సంతోష్ (వార్డు 32), నరేందర్ గౌడ్ (వార్డు 33), సుప్రిత (వార్డు 34), ఫాతిమా సఫియా (వార్డు 35), రూపా పాటిల్ (వార్డు 36).

గెలుపే లక్ష్యంగా కార్యచరణ..!

అభ్యర్థుల ప్రకటనతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తాండూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్న అభ్యర్థులను ఎంపిక చేశామని, సంక్షేమ పథకాలు మరియు గత అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ప్రచార పర్వాన్ని ముమ్మరం చేయనున్నట్లు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here