Home News సాయప్పకు శ్రీనివాస్ రెడ్డి మద్దతు…!

సాయప్పకు శ్రీనివాస్ రెడ్డి మద్దతు…!

382
0
  • 8వ వార్డులో ‘BSR’ ముమ్మర ప్రచారం
  •  సాయప్పను భారీ మెజారిటీతో గెలిపించాలి: బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
  •  ప్రముఖ వ్యక్తి మోసిన్‌తో భేటీ.. ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 8వ వార్డులో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మంగళవారం 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సాయప్ప గెలుపును కాంక్షిస్తూ ఆర్బిఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి వీధిలో పర్యటిస్తూ, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ సాయప్పకు మద్దతు తెలపాలని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ప్రచారంలో భాగంగా వార్డులోని కీలక వ్యక్తి మోసిన్‌ను శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి చెందాలంటే సమర్థుడైన నాయకత్వం అవసరమని, అందుకే సాయప్పను బరిలోకి దించామని పేర్కొన్నారు. వార్డులోని ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేస్తూ, సాయప్ప గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆయన సూచించారు.వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు సాయప్ప నిరంతరం అందుబాటులో ఉంటారని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. సరైన అభ్యర్థిని ఎంచుకోవడం ద్వారానే వార్డు ప్రగతి సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి సాయప్పతో పాటు ముఖ్య నాయకులు మహిపాల్ రెడ్డి, అయ్యూబ్, షోయబ్ మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here